రంజిత్, సుకుమార్, సత్యనారాయణ
‘‘సత్యనారాయణ చాలా కొత్త ఐడియాతో ‘స్టూవర్టుపురం’ చిత్రాన్ని తెరకెక్కించాడు. పైగా ఈ సినిమాకు ఆయన దర్శకత్వం వహించడమే కాకుండా ఎడిటింగ్, కెమెరా.. ఇలా ఆల్ రౌండర్‌గా పనిచేసి చాలా తక్కువ సమయంలో సినిమా చేశాడు. ట్రైలర్ చాలా ఆసక్తి కలిగిస్తో్తంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. ‘గూఢచారి’ ఫేమ్ ప్రీతీ సింగ్ ప్రధాన పాత్రలో సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘స్టూవర్టుపురం’. రంజిత్ కోడిప్యాక సమర్పణలో అర్కాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ని, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సుకుమార్ విడుదల చేశారు.
సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ– ‘‘నరరూప రాక్షసుల్లాంటి స్టూవర్టుపురం గ్యాంగ్ హీరోయిన్ ఇంట్లోకి చొరబడతారు. వాళ్లను ఆమె ఎలా ఎదుర్కొంది అనే పాయింట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా నిర్మించాం. రీ రికార్డింగ్‌కు మంచి స్కోప్ ఉన్న ఈ చిత్రానికి నవనీత్ చారి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నేపథ్య సంగీతం అందించారు. మా సినిమా ట్రైలర్‌ని మెచ్చుకున్న సుకుమార్‌గారికి థ్యాంక్స్. ఆయన చెప్పిన సలహాలను పాటిస్తాం’’ అన్నారు. ‘‘గతంలో మా బ్యానర్‌లో నిర్మించిన ‘నందికొండ వాగుల్లోనా, మోని’ చిత్రాల దర్శకుడు సత్యనారాయణ ఏకారి ‘స్టూవర్టుపురం’ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు’’ అని రంజిత్ అన్నారు. ‘‘పవర్‌ఫుల్ పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు ప్రీతిసింగ్.
Comments
Please login to add a commentAdd a comment