పుష్ప 2 రిలీజయ్యేది ఆరోజేనా? | Mytri Movie Makers Confirms Pushpa 2 The Rule Release Date, Official Announcement Soon - Sakshi
Sakshi News home page

Pushpa 2 The Rule Release Date: ఆ రోజు పుష్పగాడి రూల్‌? త్వరలో అధికారిక ప్రకటన

Published Sat, Aug 26 2023 12:38 AM | Last Updated on Sat, Aug 26 2023 9:11 AM

Pushpa 2 released on 22 March 2024 - Sakshi

పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ మాంచి జోష్‌లో ఉన్నారు. ‘పుష్ప’  చిత్రంలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’లో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంబరాలు పూర్తి స్థాయిలో పూర్తి కాకుండానే ‘పుష్ప’ సినిమాకు సంబంధించిన ఓ వార్త తెరపైకి వచ్చింది. ‘పుష్ప’ చిత్రంలోని మలి భాగం ‘పుష్ప: ది రూల్‌’ చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా విడుదల విషయంలో మేకర్స్‌ ఓ క్లారిటీకి వచ్చారని, వచ్చే ఏడాది మార్చి 22న ‘పుష్ప: ది రూల్‌’ను విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారని టాక్‌. విడుదల తేదీపై అతి త్వరలో అధికారిక ప్రకటన రానుందని తెలిసింది. ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో ‘పుష్ప’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పుష్పరాజ్‌ పాత్రలో అల్లు అర్జున్, శ్రీ వల్లి పాత్రలో రష్మికా మందన్నా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement