stuartpuram
-
పల్లెకు పోదాం..
‘పల్లెకు పోదాం సినిమా చేద్దాం. ఛలో చలో’ అని పాడుకుంటున్నారు కొందరు హీరోలు. ఈ హీరోలతో వెండితెరపై పల్లె కథలను చూపించేందుకు రెడీ అవుతున్నారు దర్శకులు. ఈ పల్లెటూరి కథల్లోకి వెళదాం. 1990లో ఓ గ్రామం నాగార్జున కెరీర్లో విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీస్ చాలానే ఉన్నాయి. మరోసారి నాగార్జున ఓ విలేజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ నున్నారట. రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ఈ విలేజ్ స్టోరీని డెవలప్ చేశారు. అంతేకాదు... ఈ సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయం కానున్నారని సమాచారం. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తారని తెలిసింది. 1990 నేపథ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్ ఈ నెలలోనే ఆరంభం కానుంది. కేరాఫ్ స్టువర్టుపురం 1970లలో స్టువర్టుపురంలోని నాగేశ్వరరావు గురించి తెలియనివాళ్లు ఉండి ఉండరు. ఆయన జీవితంతో ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం రూపొందింది. రవితేజ హీరోగా వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గాయత్రీ భరద్వాజ్, నూపుర్ సనన్ నాయికలు. టైగర్ నాగేశ్వరరావు జీవితం ఏ విధంగా గడిచింది? ఆయన్ను కొందరు దొంగ అని, మరి కొందరు పేదలకు హెల్ప్ చేసే ఆపద్భాందవుడు అని ఎందుకు చెప్పుకుంటున్నారు? అనే కోణంలో ఈ సినిమా ఉంటుందట. అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 20న రిలీజ్ కానుంది. పల్లెటూరి ఆటగాడు హీరో రామ్‌చరణ్ కెరీర్లో ‘రంగస్థలం’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో చిట్టిబాబు పాత్రలో రామ్‌చరణ్ సూపర్బ్. ఇప్పుడు సుకుమార్ శిష్యుడు, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనతో ఓ సినిమా చేసేందుకు రామ్‌చరణ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది పల్లెటూరి నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ ఫిల్మ్ అని, ఇందులో అన్నతమ్ములుగా రామ్‌చరణ్ డ్యూయల్ రోల్ చేయనున్నారని భోగట్టా. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఓ విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ ఇదని సమాచారం. వెంకట సతీష్ కిలారు నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. భైరవకోన మిస్టరీ శ్రీకృష్ణదేవరాయల కాలంలో చెలామణిలో ఉన్న గరుడ పురాణానికి, ఇప్పటి గరుడ పురాణానికి నాలుగు పేజీలు తగ్గాయట. ఆ గరుడ పురాణంలో మిస్ అయిన ఆ నాలుగు పేజీల కథే భైరవకోన అని హీరో సందీప్ కిషన్ అంటున్నారు. మరి.. ఆడియన్స్‌కు ఈ మిస్టరీ తెలియాలంటే థియేటర్స్‌కు రానున్న ‘ఊరిపేరు భైరవకోన’ సినిమా చూడాలి. సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. రంగబలి రాజకీయం రంగబలి అనే విలేజ్‌లో జరిగే çఘటనలు, రాజకీయ కోణాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘రంగబలి’. నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ బాసంశెట్టి దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 7న విడుదల కానుంది. కుప్పంలో హరోంహర చిత్తూరు జిల్లా కుప్పంలో ‘హరోంహర’ అంటున్నారు సుధీర్‌బాబు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరోం హర’. 1989 చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే కథగా ‘హరోం హర’ సాగుతుంది. సుమంత్ జి. నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 22న రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఆదికేశవ ఆగమనం రాయలసీమలోని ఓ గ్రామంలో ఉన్న దేవాలయంపై మైనింగ్ మాఫియా చూపు పడింది. ఈ మాఫియాకు అడ్డుగా నిలబడతాడు రుద్రకాళేశ్వర్ రెడ్డి. ఈ గ్రామాన్ని రుద్రకాళేశ్వర్ రెడ్డి ఏ విధంగా రక్షించాడు అనేది తెలుసుకోవాలంటే జూలైలో వచ్చే ‘ఆదికేశవ’ సినిమా చూడాలి. రుద్రకాళేశ్వర్ రెడ్డి పాత్రలో హీరోగా వైష్ణవ్ తేజ్ నటిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో ఎస్. నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్మగ్లింగ్ నేపథ్యంలో... కథ ప్రకారం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో జరుగుతున్న స్మగ్లింగ్‌ను అడ్డుకోవాలనుకుంటున్నారట విశ్వక్ సేన్. 1994 నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కాస్త గ్రే షేడ్స్ ఉన్న హీరో క్యారెక్టర్లో విశ్వక్ సేన్ నటిస్తున్నారు. ఇది రూరల్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వాస్తవ ఘటన ఆధారంగా.... ‘గంగతలపై ఉన్నంత వరకే శివుడు చల్లగా ఉంటాడు. కంట్లోంచి గానీ జారిందా శివమెత్తుతాడు’ అనే పవర్ఫుల్ డైలాగ్ సాయిరామ్ శంకర్ నోట వచ్చింది ఓ సినిమా కోసం. విలేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ప్రకాష్ జూరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, రమణి జూరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయారాజా సంగీతం అందిస్తుండటం విశేషం. ఇలా విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథలతో ప్రేక్షకులను అలరించేందుకు మరికొందరు హీరోలు రెడీ అవుతున్నారు. -
తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ టోకరా
బాపట్ల: తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మబలికి.. సినీ ఫక్కీలో రూ.32 లక్షల సొమ్ము గుంజుకొని పారిపోయారు. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టువర్టుపురం శివారులో జరిగింది. వివరాలు.. తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌కు చెందిన అమరనాథ్‌రెడ్డి, ఆంజనేయులు బంగారం వ్యాపారం చేస్తుంటారు. బాపట్లలో తక్కువ ధరకు బంగారం వస్తుందని తెలుసుకున్న ఆంజనేయులు.. తనకున్న పరిచయాలతో స్టువర్టుపురానికి చెందిన గురవయ్య అలియాస్ చిట్టిబాబును ఫోన్లో సంప్రదించాడు. చిట్టిబాబు తన బంధువైన ఉత్తమ్‌కు ఈ విషయం తెలియజేశాడు. ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి రూ.45 లక్షల విలువైన బంగారాన్ని రూ.32 లక్షలకు ఇస్తామని నమ్మబలికారు. దీంతో అమరనాథ్‌రెడ్డి, ఆంజనేయులు చీరాలకు వచ్చి ఓ లాడ్జిలో బస చేశారు. ఉత్తమ్‌కుమార్, చిట్టిబాబు వారి వద్దకు వచ్చి రూ.32 లక్షలు ఉన్నాయని నిర్ధారణ చేసుకున్నాక బేతపూడికి రావాలని చెప్పి వెళ్లిపోయారు. అమరనాథ్‌రెడ్డి, ఆంజనేయులు అక్కడకు చేరుకోగా బంగారం ఇవ్వకుండానే రూ.32 లక్షలను ఉత్తమ్, చిట్టిబాబు లాక్కున్నారు. ఇంతలో కొందరు అక్కడకు చేరుకొని.. తాము పోలీసులమంటూ భయపెట్టి అమరనాథ్‌రెడ్డిని, ఆంజనేయులను అక్కడ్నుంచి పంపించేశారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న వారిద్దరూ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
స్టువర్టుపురం.. ఈ గ్రామానికో ప్రత్యేకత!
సాక్షి, బాపట్ల: గజదొంగలలో మార్పు తీసుకొచ్చేందుకు చేసిన ప్రయోగానికి 107 ఏళ్లు నిండాయి. దొంగలలో మార్పు తీసుకురావటంతోపాటు సమాజంలో గౌరవపదమైన జీవితాన్ని గడిపించేందుకు మేజర్ మెకర్జీ, నాటి తమిళనాడు, ఆంధ్ర ప్రాంతాల ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్ స్టూవర్టు చేసిన ప్రయత్నం ఫలించింది. 1913లో ఆపరేషన్ స్టువర్టు పేరుతో 200 మంది గజదొంగలపై చేసిన ప్రయోగం చివరికి దేశ చరిత్రలోనే ఓ ప్రత్యేకత సంతరించుకుంది. అప్పటి పాలకుల లక్ష్యానికి ధీటుగా స్టూవర్టుపురం ప్రాంత ప్రజలు జీవనాన్ని సాగిస్తున్నారు. స్టువర్టుపురం ఏర్పడింది ఇలా... ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాలలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండేవి. అప్పట్లో దొంగలకు పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసిన్పటి ఫలించలేదు. అయితే 1913 సంవత్సరంలో బాపట్ల ప్రాంతంలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న ఇంగ్లండ్ దొర మేజర్ మెకర్జీ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు స్థలాన్ని కేటాయించాలని కోరారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పించేందుకు ఆయన ప్రాధాన్యత చూపాలని కోరగా అప్పటి మద్రాస్ గవర్నర్ స్టూవర్టు మెకర్జీ ప్రతిపాదనకు ఓకే చెప్పారు. అయితే దొంగలను కూడా అదే ప్రాంతంలో ఉంచి పునారావాసం కల్పించేందుకు కృషి చేయాలని కోరగా ఇద్దరు తెల్లదొరల మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా స్టూవర్టుపురం ఎర్పడింది. ప్రభుత్వం మూడు వేల ఎకరాలు స్థలాన్ని సాల్వేషన్ ఆర్మీకి అప్పగించగా అందులో 200మంది దొంగలకు ఒక్కొక్కరికి రెండు ఎకరాల పొలం కేటాయించి వ్యవసాయం చేయించేందుకు పెట్టుబడులు కూడా సాల్వేషన్ ఆర్మీ ఇచ్చింది. స్టువర్టుపురంలోని హైస్కూలు ప్రతి రోజు హాజరు వేయాల్సిందే... అప్పట్లో ఉదయం పూట వ్యవసాయం చేయటంతోపాటు రాత్రి తొమ్మిదిగంటలకు ప్రతి దొంగ వచ్చి సంతకం పెట్టాలి. సంతకం పెట్టకపోతే ఆరోజు రాష్ట్రంలో ఎక్కడ దొంగతనం జరిగినప్పటికి ఆ నేరం వీరిపై వేయటం జరిగేది. దీంతో శిక్ష వేసేందుకు స్థానికంగా జైలును కూడా ఏర్పాటు చేశారు. ఈవిధంగా కాలక్రమేణ దొంగతనాలకు ఫుల్స్టాప్ పడింది. సాల్వేషన్ ఆర్మీ పేరుతో ఉన్న పొలాలకు 1997 సంవత్సరంలో ప్రభుత్వం వ్యక్తిగత పట్టాలు ఇచ్చి వారికి మరింత చేయూతనిచ్చింది. ఈ పొలాలలో వరి, ఆకుకూరలు, పూలమొక్కలు పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చదవండి: ఆమెకు 25.. అతడికి 18.. విద్యా వ్యాప్తికి కృషి విద్యావ్యాప్తికి సాల్వేషన్ ఆర్మీ కృషి మొదలుపెట్టింది. 1914లో రక్షణ సైన్యం పేరుతో పాఠశాలకు రూపకల్పన చేసింది. ప్రకాశం జిల్లా చీరాల, గుంటూరు జిల్లా బాపట్లకు మధ్యలో హైస్కూలు లేకపోవటంతో పలు గ్రామాలకు చెందిన వారు చదువుకునేందుకు స్టూవర్టుపురంలో ఏర్పాటు చేసిన సాల్వేషన్ ఆర్మీ ఏర్పాటు చేసిన రక్షణసైన్యం స్కూలులో చేరారు. ఈ పాఠశాల ఏ ముహుర్తన ప్రారంభించారోగానీ ఇక్కడ చదివిన చాలా మంది విద్యార్థులు దేశ,రాష్ట్ర పరిపాలనలో చోటు సంపాదించుకున్నారు. పరిపాలన వ్యవహారాలలో ఐఏఎస్ నుంచి జాతీయ కమిషన్ చైర్మన్ హోదా వరకు ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు చోటు దక్కించుకున్నారు. ఉన్నత శిఖరాలకు చేరిన వారు .. దేవర రాజగోపాల్ (ఐఎఎస్), పాలపర్తి వెంకటేశ్వర్లు (ఐఏఎస్), దేవర సుబ్బారావు (ఎస్టీ కార్పొరేషన్ డైరెక్టర్), ఏడుకొండలు (ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్), దేవర, నాగరాజు (సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్), చిన్నపోతుల ప్రసాదరావు (అసిస్టెంట్ కమిషనర్), బి.ప్రేమకుమారి (సబ్ కలెక్టర్), శర్మరావు (డివిజనల్ రైల్వే మేనేజర్), కొండా వణీష్, నిరంజన్(ఎంఈఓలు) తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ యూనివర్శిటీలలో అధ్యాపకులుగా చాలా మంది ఉన్నారు. -
గజ్వేల్‌లో స్టువర్టుపురం దొంగల ముఠా అరెస్టు
గజ్వేల్‌రూరల్: చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠాను అరెస్టు చేసినట్లు గజ్వేల్ సీఐ ఆంజనేయులు తెలిపారు. శనివారం గజ్వేల్‌లో సీఐ మధుసూదన్‌రెడ్డితో కలిసి ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులు శుక్రవారం మఫ్టిలో ఉన్న పోలీసులకు కనబడగా... వారిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారన్నారు. స్టూ్టవర్టుపురం దొంగలు.. వీరంతా గుంటూరు జిల్లా బాపట్ల మండలం çస్టూవర్టుపురం గ్రామానికి చెందిన మాసపాటి వెంకటేశ్వర్లు అలియాస్ పెద్దులు, గజ్జెల అంకాలు, అవుల రాజవ్వలు ఒక ముఠాగా ఏర్పడి ప్రయాణీకుల నుంచి పిక్ పాకెటింగ్‌తో పాటు బ్యాగులను చోరీ చేసేవారన్నారు. వీరు విజయవాడ, బాపట్ల, గూడురు, పిడుగురాల్ల, సూర్యారావుపేట, చీరాల, బోనకల్, కాల్వపాలెం, సత్తెనపల్లి ప్రాంతాల్లో 20వరకు చోరీలు చేసి జైలు వెళ్ళివచ్చారని తెలిపారు. నేరాల వివరాలు.. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జేబీఎస్ నుంచి సిద్దిపేటకు బస్సులో వస్తున్న ఓ ప్రయాణికుడి బ్యాగును దొంగిలించి.. అందులో ఉన్న 5తులాల బంగారు ఆభరణం తీసుకొని బ్యాగును బస్టాండ్ ప్రాంతంలో పడేసి, నగలను తమకు తెలిసిన ఓ వ్యక్తి(కోటయ్య)వద్ద పెట్టారన్నారు. అదే విధంగా మే నెలలో స్వరూప అనే మహిళలు పిల్లతో కలిసి ప్రజాపూర్‌లో బస్సు ఎక్కేసమయంలో ఆమెకు అడ్డుగా వెళ్ళి బ్యాగులో నుంచి పర్సును దొంగిలించగా... అందులో రూ. 21వేల నగదు, నల్లపూసల దండ, రింగులు, మాటీలను, ఆగస్టు నెలలో సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఓ వ్యక్తి తన భార్యాపిల్లలతో కలిసి బస్సు ఎక్కేసమయంలో మహిళ బ్యాగులో నుంచి పర్సును దొంగిలించగా.. అందులో లాంగ్‌చైన్, నెక్లెస్, నల్లపూసల దండను, అక్టోబర్ నెలలో నాచారం గుడివద్ద బస చేసి మరుసటి రోజు గజ్వేల్ బస్టాండ్ వద్ద ఆటోలో ప్రయాణీస్తున్న ఓ మహిళ బ్యాగులో నుంచి చంద్రహారం, నల్లపూసల దండ, బంగారు లాకెట్, వంకు ఉంగరాలు, కమ్మలు, చిన్నపిల్లల ఉంగరాలతో ఉన్న పర్సును చోరీ చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొమ్ము.. వీరి వద్దనుంచి ఐదున్నర తులాల బంగారు పెద్దగొలుసు, 4తులాల చంద్రహారం, 3తులాల నల్లపూసల దండ, రెండున్నర తులాల నల్లపూసల దండ, 1.25తులాల బంగారు లాకెట్‌ను స్వా«దీనం చేసుకున్నామన్నారు. గజ్వేల్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో గజ్వేల్ సీఐలు ఆంజనేయులు, మ«ధుసూదన్రెడ్డి, సిద్దిపేట 1టౌన్ సీఐ సైదులు, క్రైం పార్టీ సిబ్బంది యాదగిరి, రాంజి, సుభా‹Ùలు ప్రత్యేక టీంగా ఏర్పడి నేరస్తులను పట్టుకోవడం జరిగిందని వీరికి సిద్దిపేట సీపీ రివార్డును అందించినట్లు తెలిపారు. -
కొత్త ఐడియాతో తీశారు
‘‘సత్యనారాయణ చాలా కొత్త ఐడియాతో ‘స్టూవర్టుపురం’ చిత్రాన్ని తెరకెక్కించాడు. పైగా ఈ సినిమాకు ఆయన దర్శకత్వం వహించడమే కాకుండా ఎడిటింగ్, కెమెరా.. ఇలా ఆల్ రౌండర్‌గా పనిచేసి చాలా తక్కువ సమయంలో సినిమా చేశాడు. ట్రైలర్ చాలా ఆసక్తి కలిగిస్తో్తంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. ‘గూఢచారి’ ఫేమ్ ప్రీతీ సింగ్ ప్రధాన పాత్రలో సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘స్టూవర్టుపురం’. రంజిత్ కోడిప్యాక సమర్పణలో అర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ని, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సుకుమార్ విడుదల చేశారు. సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ– ‘‘నరరూప రాక్షసుల్లాంటి స్టూవర్టుపురం గ్యాంగ్ హీరోయిన్ ఇంట్లోకి చొరబడతారు. వాళ్లను ఆమె ఎలా ఎదుర్కొంది అనే పాయింట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా నిర్మించాం. రీ రికార్డింగ్‌కు మంచి స్కోప్ ఉన్న ఈ చిత్రానికి నవనీత్ చారి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నేపథ్య సంగీతం అందించారు. మా సినిమా ట్రైలర్‌ని మెచ్చుకున్న సుకుమార్‌గారికి థ్యాంక్స్. ఆయన చెప్పిన సలహాలను పాటిస్తాం’’ అన్నారు. ‘‘గతంలో మా బ్యానర్లో నిర్మించిన ‘నందికొండ వాగుల్లోనా, మోని’ చిత్రాల దర్శకుడు సత్యనారాయణ ఏకారి ‘స్టూవర్టుపురం’ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు’’ అని రంజిత్ అన్నారు. ‘‘పవర్ఫుల్ పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు ప్రీతిసింగ్. -
ప్రస్తుతం స్టూవర్ట్‌పురం పూర్తిగా మారింది
గిరిజనాభ్యుదయ సంస్థ కార్యదర్శి వివరణ సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా స్టూవర్ట్‌పురం గ్రామం ప్రస్తుతం పూర్తిగా మారిపోయిందని గిరిజనాభ్యుదయ సంస్థ కార్యదర్శి అన్నపు సమర్పణరావు పేర్కొన్నారు. తాను పుట్టిపెరిగిన ఆ గ్రామంలో లండన్ సాల్వేషన్ ఆర్మీతో పాటు సంస్కార్ సంస్థల కృషి ఫలితంగా గణనీయమైన మార్పులు వచ్చాయని ఆయన తెలిపారు. ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన ‘కిక్.. కమలాకర్’ వార్తపై సమర్పణరావు ఆ గ్రామం తరఫున సోమవారం వివరణ ఇచ్చారు. ప్రస్తుతం స్టూవర్ట్‌పురం గ్రామంలో 90 శాతానికి పైగా విద్యావంతులు ఉన్నారని, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉన్నత స్థాయిలకు చేరుకున్నారని తెలిపారు. అయితే ఇప్పటికీ కొందరు పోలీసులు గ్రామంలో ఉన్న వారంతా నేరచరితులే అన్నట్లు వ్యవహరిస్తున్నారని సమర్పణరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైఖరిలో పూర్తిస్థాయి మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. స్టూవర్ట్‌పురంలో ఇప్పుడున్న పరిస్థితులపై మీడియా సైతం దృష్టిపెట్టాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఆ గ్రామంలో ఎలాంటి పిక్‌పాకెటింగ్, దొంగల బడులు లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వం గ్రామస్తులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తే స్టూవర్ట్‌పురం అభివృద్ధి పథంలో మరింత ముందుకు వెళ్తుందని సమర్పణరావు వివరించారు.