
సందీప్ మాధవ్
‘వంగవీటి’ ఫేమ్ సందీప్ మాధవ్ (సాండి) లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘జార్జ్ రెడ్డి’. 1965 నుంచి 1975 కాలంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన స్టూడెంట్ లీడర్ ‘జార్జ్ రెడ్డి’ బయోపిక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ‘దళం’ మూవీ ఫేం జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ– ‘‘మా సినిమా ట్రైలర్‌తోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
జీవన్ రెడ్డి ఈ సినిమాను రియలిస్టిక్‌గా తీశాడు. బయోపిక్ అయినా అన్ని వాణిజ్య అంశాలు ఇందులో ఉంటాయి. వ్యాపార పరంగా కూడా మంచి ఆఫర్లు వచ్చాయి. మా చిత్రం థియేట్రికల్ రైట్స్‌ను అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా సొంతం చేసుకున్నారు. సినిమా విజ యంపై చాలా నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సుధాకర్ యెక్కంటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, నేపథ్య సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్: దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి, సహ నిర్మాత: సంజయ్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment