బసవ శంకర్, శర్వానంద్, గార్గేయి, రాకేశ్ వర్రే
రాకేశ్ వర్రే హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ఎవరికీ చెప్పొద్దు’. గార్గేయి యల్లాప్రగడ కథానాయికగా నటించారు. బసవ శంకర్ దర్శకత్వంలో క్రేజీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా ఈనెల 22న విడుదలకానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో శర్వానంద్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ చాలా బాగుంది. సినిమా చాలా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. రాకేశ్ వర్రే మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత తరంలో ఉన్న సమస్యను బసవ శంకర్‌గారు వినోదాత్మకంగా హ్యాండిల్ చేశారు.
సినిమా ఆద్యంతం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది. ట్రైలర్‌ను విడుదల చేసిన శర్వానంద్‌గారికి థ్యాంక్స్. టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. మేం చెప్పాలనుకున్న విషయాన్ని సున్నితంగా చెప్పాం. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాం’’ అన్నారు బసవ శంకర్. ఈ చిత్రానికి సంగీతం: శంకర్ శర్మ, కెమెరా: విజయ్ జె.ఆనంద్.
Comments
Please login to add a commentAdd a comment