‘‘రెండు జంటల మధ్య లవ్, ఎమోషన్‌తో పాటు యముడి రాసే తల రాతలు ఎలా ఉంటాయనేది ఈ ‘యమ డ్రామా’ ట్రైలర్‌లో దర్శకుడు హర్ష అద్భుతంగా చూపించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించి యూనిట్‌కి మంచి పేరు, డబ్బు తీసు కురావాలి’’ అని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. సాయికుమార్ లీడ్ రోల్‌లో టి. హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యమ డ్రామా’. సుకన్య సమర్పణలో ఫిల్మీ మెజీషియన్స్ పతాకంపై టి.
రామకృష్ణ రావు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా హర్ష మాట్లాడుతూ– ‘‘అనిల్ రావిపూడిగారు తన సినిమా పనిలో బిజీగా ఉన్నా మా మీద అభిమానంతో మా యూనిట్‌కి సలహాలు ఇస్తూ, ట్రైలర్ లాంచ్ చేసినందుకు ఆనందంగా ఉంది. నేటి యువత చిన్న సమస్యలకు, ఒత్తిళ్లకు లొంగిపోయి కన్నీళ్లు పెట్టుకోవడం సరికాదు.. చమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలం అనేది తెలుసుకోవాలి. ఇలాంటి సందేశంతో యువతని టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది’’ అన్నారు. పోసాని కృష్ణమురళి, జెన్నీ, గౌతమ్ రాజు, సుదర్శన్ రెడ్డి, నవీన్, వేణు వండర్స్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: దాము నర్రావుల, సంగీతం: సునీల్ కశ్యప్.
Comments
Please login to add a commentAdd a comment