Watch: Dhanush Sir Movie Official Trailer Released - Sakshi
Sakshi News home page

Sir Movie Trailer: సార్‌ మూవీ ట్రైలర్‌ అవుట్‌.. కేక పెట్టించేలా ధనుష్‌ డైలాగ్స్‌

Feb 8 2023 7:37 PM | Updated on Feb 14 2023 5:00 PM

Dhanush Sir Movie Official Trailer Release - Sakshi

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ కథానాయకుడిగా తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘వాతి’. తెలుగులో సార్‌ అనే పేరును నిర్ణయించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 17వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతుంది.

చదవండి: ఫేం కోసం తప్పుడు ప్రచారం.. ‘సింగింగ్‌ ఐకాన్‌’ యశస్వి చీటింగ్‌ బట్టబయలు!

ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా సార్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్‌ను కేక పెట్టించేలా ఉన్నాయి. దీంతో మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ‘చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు వారికి చదువు దొరకలేదు.. ఇప్పుడు మీరు వచ్చినా వాళ్ల కోసం ఉంటారన్న నమ్మకం వాళ్లకి కుదరడం లేదు..’ అంటూ ధనుష్‌ చెప్పే డైలాగ్‌ అందరిని ఎమోషనల్‌గా కనెక్ట్‌ చేస్తుంది. డబ్బు, చదువు ఇంపార్టెన్స్ చెప్పే కోణంలోనే ఈ సార్ ఉండబోతోందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement