రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ బ్రేకప్‌ సాంగ్‌ విన్నారా? | oh saathiya movie release soon | Sakshi
Sakshi News home page

ప్రేమికుల రోజు బ్రేకప్‌ సాంగ్‌ రిలీజ్‌.. వెళ్లిపోయే.. వెళ్లిపోయే... పాట విన్నారా?

Published Wed, Feb 15 2023 1:59 AM | Last Updated on Wed, Feb 15 2023 3:34 PM

oh saathiya  movie release soon - Sakshi

ఆర్యన్ గౌర, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ సాథియా’. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా స్టార్ డైరెక్టర్ క్రిష్ చేతుల మీదుగా ఈ సినిమా లోని 'వెళ్లిపోయే..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. వెళ్లిపోయే.. పాపా వెళ్లిపోయే.. అంటూ సాగిపోయే ఈ బ్రేకప్ సాంగ్ లో యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

భాస్కరభట్ల రాసిన పదాల కూర్పులో నిజమైన ప్రేమికుడి భావాలు మనసుకు హత్తుకుంటున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన తీరు.. సాంగ్ కి తగ్గట్టుగా బాబా భాస్కర్ కొరియోగ్రఫీ ఈ పాటలో హైలైట్ అయ్యాయి. వినోద్  కుమార్ (విన్ను) అందించిన మ్యూజిక్ ఈ సాంగ్‌కి మేజర్ అట్రాక్షన్ గా మారింది. త్వరలోనే సినిమా విడుదల తేదిని ప్రకటిస్తామని చిత్రం బృందం పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement