
క్రిష్ అనగానే అందరూ టకీమని చెప్పే పేరు హృతిక్ రోషన్. క్రిష్ పాత్రలో అంతగా ఆయన ఒదిగిపోయారు. బుధవారం ఆయన బర్త్‌డే. ఈ సందర్భంగా హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ క్రిష్ ఫ్రాంచైజీ అభిమానులందరికీ ఓ తీపి కబురు అందించారు. అదేంటో తెలుసా? ‘క్రిష్ 4’ రిలీజ్ అప్‌డేట్.
ఇప్పటివరకు వచ్చిన క్రిష్ సినిమాలన్నింటికీ రాకేష్ రోషన్‌నే దర్శకుడని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘‘క్రిష్ 4 రిలీజ్‌ను ఎనౌన్స్ చేయడానికి ఇంతకన్నా మంచి రోజు ఉండదేమో. 2020 క్రిస్మస్‌కు ‘క్రిష్ 4’ను రిలీజ్ చేయాలనుకుంటున్నాం. హృతిక్ ఫ్యాన్స్ అందరికీ నా గిఫ్ట్ ఇది. హ్యాపీ బర్త్‌డే హృతిక్’’ అని పేర్కొన్నారు రాకేష్ రోషన్.
Comments
Please login to add a commentAdd a comment