జ్యోతిక, సూర్య
‘కాక్క కాక్క’.. హీరో సూర్య కెరీర్ టర్నింగ్ మూవీ. తమిళ ఇండస్ట్రీలో తనకో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడమే కాకుండా తన ప్రేమను సంపాదించుకున్నారు ఈ సినిమా ద్వారా. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే సూర్య–జ్యోతిక ప్రేమలో పడ్డారని అప్పట్లో కోలీవుడ్‌లో చెప్పుకునేవారు. అలా సూర్య–జ్యోతికల లైఫ్‌లో స్వీట్ మెమరీగా నిలిచిపోయే ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించే ప్లాన్ ఇప్పుడు జరుగుతోందట. ఈ సీక్వెల్‌తోనే సూర్య– జ్యోతిక మళ్లీ కలసి నటించ బోతున్నారట. పెళ్లికి ముందు ‘నువ్వు నేను ప్రేమ’ చిత్రంలో ఇద్దరూ కలసి నటించారు సూర్య, జ్యోతిక.
పెళ్లయిన పన్నెండేళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్‌ను షేర్ చేసుకోనుండటం విశేషం. నిర్మాత కలైపులి యస్. థాను ఇటీవలే ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించమని దర్శకుడు గౌతమ్ మీనన్‌ను సంప్రదించినట్టు సమాచారం. ‘ధృవనక్షత్రం, ఎనై నోక్కి పాయుమ్ తోట్టా’ సినిమాలతో బిజీగా ఉన్న గౌతమ్ వీటిని పూర్తి చేసిన వెంటనే ఈ స్క్రిప్ట్ తయారు చేసే పనిలో పడతారట. మొదటి భాగానికి సంగీతం అందించిన హ్యారిస్ జయరాజ్‌నే సంగీత దర్శకుడిగా తీసుకోనున్నారట. ఈ చిత్రం ‘ఘర్షణ’ పేరుతో వెంకటేశ్, అసిన్‌లతో తెలుగులో రీమేక్ అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment