స్టార్ హీరోయిన్.. అయినా ఒక్క సినిమా సక్సెస్ కాలేదు.. మళ్లీ అదే కథ! | Trisha Krishnan Latest Movie The road Working Video Goes Viral | Sakshi
Sakshi News home page

Trisha Krishnan: కొత్త కథతో వస్తున్న 'త్రిష'.. ఈ సారైనా అదృష్టం వరించేనా?

Published Sun, May 7 2023 9:14 AM | Last Updated on Sun, May 7 2023 10:02 AM

Trisha Krishnan Latest Movie The road Working Video Goes Viral - Sakshi

నటి త్రిష సినీ పయనం పడి లేచే కేరటం లాంటిది అని చెప్పవచ్చు. దక్షిణాదిలో అగ్ర కథానాయకి స్థాయికి ఎదిగిన ఈమె తన స్థానాన్ని మరింత పెంచుకోవడానికి లేడీ ఓరియంటెడ్‌ కథాచిత్రాల్లో నటించడం మొదలెట్టారు. ఇప్పటికే నటి నయనతార ఆ తరహా చిత్రాల్లో రాణిస్తుండటంతో తానేం తక్కువ అన్నట్టుగా త్రిష దూసుకుపోతోంది. అలా నాయకి చిత్రం నుంచి ఆ మధ్య విడుదలైన రాంగీ చిత్రం వరకు కొన్ని లేడీ ఓరియంటెడ్‌ కథా చిత్రాల్లో నటించింది.

(ఇది చదవండి: Bichagadu 2 Movie: నన్ను పెద్ద యాక్సిడెంట్ నుంచి కాపాడింది ఆమెనే: విజయ్ ఆంటోని)

అయితే ఈ విషయంలో పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్న సామెతగా మారింది త్రిష పరిస్థితి. ఆమె నటించిన ఏ ఒక్క హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రం సక్సెస్‌ కాలేదు. అలాంటిది ఈమె మరోసారి హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రంతో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. త్రిష నటించిన 'ది రోడ్‌' చిత్రం తమిళం తెలుగు మలయాళం కన్నడం హిందీ భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది.

ఏఏఏ సినిమా ప్రవేట్‌ లిమిటెడ్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్‌ వశీకరణన్‌ తెరకెక్కిస్తున్నారు. నటుడు సబీర్‌, సంతోష్‌ ప్రతాప్‌, నటి మియా జార్జ్‌ ,ఎంఎస్‌ భాస్కర్‌, వేల రామ్మూర్తి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్‌ సీఎస్‌ సంగీతాన్ని, కేజీ వెంకటేష్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర వర్కింగ్‌ వీడియోను త్రిష పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం విడుదల చేశారు.

(ఇది చదవండి: ఢీ షోకి వెళ్లాక రూ. 6 లక్షల దాకా డబ్బులిచ్చాను: చైతన్య తల్లి)

చిత్రంలో త్రిష యాక్షన్‌ సన్నివేశాలు నటించినట్లు తెలుస్తోంది ఇది మధురైలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రమని దర్శకుడు తెలిపారు. జూన్‌లో చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ చిత్రం అయినా లేడీ ఓరియంటెడ్‌ కథా చిత్రాల్లో సక్సెస్‌ సాధించాలన్న త్రిష కోరికను నెరవేరుస్తుందా..? అన్నది వేచి చూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement