The road
-
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ ఐదు స్పెషల్!
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి దీపావళి స్పెషల్ కానుకగా 'జపాన్', 'జిగర్ తాండ', 'టైగర్ 3' లాంటి డబ్బింగ్ మూవీస్ మాత్రమే థియేటర్లలోకి వస్తున్నాయి. చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలు బిగ్ స్క్రీన్‌పై రిలీజ్ కావడం లేదు. దీంతో ఆటోమేటిక్‌గా ప్రేక్షకుల దృష్టి ఓటీటీలపై పడుతుంది. అందుకు తగ్గట్లే ఈ శుక్రవారం బోలెడన్ని కొత్తకొత్త సినిమాలు-సిరీసులు రెడీ అయిపోయాయి. (ఇదీ చదవండి: హగ్గులు-కిస్సులతో ఊపిరాడనివ్వలేదు.. ఆ ఇద్దరి గురించి ప్రియాంకకు వార్నింగ్!) ఈ సోమవారం ఓటీటీ మూవీస్ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పటికీ 20కి పైగా సినిమాలు వచ్చాయి. కానీ వీటిలో కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ అయిపోతుండగా, మరికొన్ని కొత్తగా వచ్చి చేరాయి. అలా ఈ శుక్రవారమే దాదాపు 18 మూవీస్-వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. వీటిలో పిప్పా, ద రోడ్, కన్నూరు స్క్వాడ్, ఘూమర్, ద బాయ్స్ హాస్టల్ సినిమాలతో పాటు లేబుల్ అనే వెబ్ సిరీస్ ఆసక్తి కలిగిస్తోంది. వీటిలో మీ ఛాయిస్ ఏంటి? ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు (నవంబరు 10) నెట్‌ఫ్లిక్స్ ఎట్ ద మూమెంట్ - మాండరిన్ సిరీస్ ఫేమ్ ఆఫ్టర్ ఫేమ్ - స్పానిష్ సిరీస్ ద కిల్లర్ - ఇంగ్లీష్ సినిమా అకుమా కున్ - జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) అమెజాన్ ప్రైమ్ 007: రోడ్ టూ ఏ మిలియన్ - ఇంగ్లీష్ సిరీస్ దిన్ హసీమ్ - ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో పిప్పా - హిందీ చిత్రం పులిక్కుత్తు పండి - తమిళ మూవీ హ్యాక్ క్రైమ్స్ ఆన్లైన్ - హిందీ సిరీస్ క్రష్డ్ సీజన్ 3 - హిందీ సిరీస్ (నవంబరు 11) BTS ఎట్ టూ కమ్ - కొరియన్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కన్నూరు స్క్వాడ్ - తెలుగు డబ్బింగ్ మూవీ లేబుల్ - తెలుగు డబ్బింగ్ సిరీస్ జీ5 ఘూమర్ - హిందీ సినిమా ఆహా ద రోడ్ - తెలుగు డబ్బింగ్ చిత్రం బుక్ మై షో ద అడల్ట్స్ - ఇంగ్లీష్ మూవీ లయన్స్ గేట్ ప్లే వాట్స్ లవ్ గాట్ టుడూ విత్ ఇట్ - ఇంగ్లీష్ సినిమా ఈ - విన్ ద బాయ్స్ హాస్టల్ - తెలుగు డబ్బింగ్ మూవీ (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'టైగర్ నాగేశ్వరరావు'.. అనుకున్న టైమ్ కంటే ముందే?) -
స్టార్ హీరోయిన్.. అయినా ఒక్క సినిమా సక్సెస్ కాలేదు.. మళ్లీ అదే కథ!
నటి త్రిష సినీ పయనం పడి లేచే కేరటం లాంటిది అని చెప్పవచ్చు. దక్షిణాదిలో అగ్ర కథానాయకి స్థాయికి ఎదిగిన ఈమె తన స్థానాన్ని మరింత పెంచుకోవడానికి లేడీ ఓరియంటెడ్ కథాచిత్రాల్లో నటించడం మొదలెట్టారు. ఇప్పటికే నటి నయనతార ఆ తరహా చిత్రాల్లో రాణిస్తుండటంతో తానేం తక్కువ అన్నట్టుగా త్రిష దూసుకుపోతోంది. అలా నాయకి చిత్రం నుంచి ఆ మధ్య విడుదలైన రాంగీ చిత్రం వరకు కొన్ని లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటించింది. (ఇది చదవండి: Bichagadu 2 Movie: నన్ను పెద్ద యాక్సిడెంట్ నుంచి కాపాడింది ఆమెనే: విజయ్ ఆంటోని) అయితే ఈ విషయంలో పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్న సామెతగా మారింది త్రిష పరిస్థితి. ఆమె నటించిన ఏ ఒక్క హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం సక్సెస్ కాలేదు. అలాంటిది ఈమె మరోసారి హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంతో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. త్రిష నటించిన 'ది రోడ్' చిత్రం తమిళం తెలుగు మలయాళం కన్నడం హిందీ భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది. ఏఏఏ సినిమా ప్రవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్ వశీకరణన్ తెరకెక్కిస్తున్నారు. నటుడు సబీర్, సంతోష్ ప్రతాప్, నటి మియా జార్జ్ ,ఎంఎస్ భాస్కర్, వేల రామ్మూర్తి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, కేజీ వెంకటేష్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర వర్కింగ్ వీడియోను త్రిష పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం విడుదల చేశారు. (ఇది చదవండి: ఢీ షోకి వెళ్లాక రూ. 6 లక్షల దాకా డబ్బులిచ్చాను: చైతన్య తల్లి) చిత్రంలో త్రిష యాక్షన్ సన్నివేశాలు నటించినట్లు తెలుస్తోంది ఇది మధురైలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రమని దర్శకుడు తెలిపారు. జూన్‌లో చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ చిత్రం అయినా లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో సక్సెస్ సాధించాలన్న త్రిష కోరికను నెరవేరుస్తుందా..? అన్నది వేచి చూడాల్సిందే. -
కేజీ రోడ్డు.. ఇక ఎన్‌హెచ్
హైవే అథారిటీ ఆధీనంలోకి కర్నూలు-గుంటూరు రహదారి త్వరలో అభివృద్ధికి చర్యలు వినుకొండ రూరల్:కర్నూలు- గుంటూరు రాష్ట్ర రహదారికి మహర్దశ పట్టనుంది. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయి రహదారిగా ఉన్న కేజీ రోడ్డును నేషనల్ హైవే అథారిటి వారు స్వాధీనం చేసుకుని జాతీయ స్థాయి రహదారిగా మార్పు చేయనున్నారు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్‌ఫోర్ట్, హైవేస్ ఈ ఏడాది మే 26న విడుదల చేసిన నోటిఫికేషన్లో ఇప్పటి వరకు ఆర్అండ్బీ ఆధీనంలో ఉన్న కేజీ రహదారిని నేషనల్ హైవే అథారిటీకి అప్పగించాలని కోరారు. అందులో భాగంగా కేజీ రహదారిని ఆర్అండ్బీ అధికారులు మరో రెండు రోజుల్లో నేషనల్ హైవే అథారిటికి అప్పగించనున్నారు. అలాగే నేషనల్ హైవేస్ అథారిటీ వారు ఇప్పటికే రహదారి సర్వే పనులకు ప్రైవేటు సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించారు. టెండర్ దక్కించుకున్న సంస్థ కేజీ రహదారిలో సరాసరి ఎన్ని వాహనాలు ప్రయాణిస్తున్నాయి, వచ్చే 50 సంవత్సరాల్లో ఎంత మేరకు ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది, ఎన్ని లైన్లు రహదారిగా రూపొందించాలి తదితర వివరాలు సేకరించి ఎన్‌హెచ్‌కు అప్పగించనున్నారు. రహదారుల అనుసంధానంలో భాగంగా.. గతంలో ఉన్న కేజీ రోడ్డును రెండు భాగాలుగా చేసి గుంటూరు నుంచి ప్రకాశం జిల్లా తోకపల్లి వరకు ఒకటి, తోకపల్లి నుంచి గిద్దలూరు, నంద్యాల మీదుగా కర్నూలు వరకు దశాబ్దంన్నర క్రితం డబుల్ లైన్‌గా స్టేట్ హైవేస్ అథారిటీ వారు అభివృద్ధి చేశారు. నవ్యాంధ్ర ఏర్పడిన తరువాత రాష్ట్రంలోని రహదారుల కనెక్టివిటీలో భాగంగా నూతన రాజధానికి అన్ని వైపుల నుంచి రహదారులను అనుసంధానం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతం వారు అయినా నేరుగా రాజధానికి చేరుకునే విధంగా రూపొందిస్తున్న రహదారుల్లో రాయలసీమ ప్రాంతం నుంచి గుంటూరుకు వచ్చే ప్రధాన మార్గాల్లో కేజీ రహదారి ఒకటి. అందులో భాగంగానే ఎన్‌హెచ్ 44 నుంచి ఒకటి, ఎన్‌హెచ్ 40 నుంచి మరొక రోడ్డు మార్గాలను నేషనల్ హైవేస్ అథారిటి వారు స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేయనున్నారు. ఎన్‌హెచ్ 44లో అనంతపురం వద్ద నుంచి తాడిపత్రి, కొలిమిగుండ్ల, బనగానపల్లి, గాజులపల్లి, గిద్దలూరు, కంభం, తోకపల్లి, వినుకొండ, నరసరావుపేట మీదుగా గుంటూరు వద్ద నున్న ఎన్‌హెచ్16కు కలపనున్నారు. ఎన్‌హెచ్ 40 రహదారిలో కర్నూలు వద్ద నుంచి నందికొట్కూరు, ఆత్మకూరు, దోర్నాల వరకు అభివృద్ధి చేయనున్నారు. అనంతపురం నుంచి గుంటూరు వరకు నూతనంగా అభివృద్ధి చేయనున్న రహదారికి ఎన్‌హెచ్ 544డి, కర్నూలు నుంచి దోర్నాల వరకు అభివృద్ధి చేయనున్న రహదారికి 340సిగా నేషనల్ హైవేస్ అథారిటీ వారు పేర్కొన్నారు. వినుకొండకు బైపాస్ రోడ్డు వేస్తారా? రోడ్డు విస్తరణ అన్న ప్రతిసారి వినుకొండ వాసుల్లో గుబులు మొదలవుతుంది. పట్టణం మధ్య నుంచి వెళ్తున్న కేజీ రోడ్డు అభివృద్ధిలో భాగంగా మొదటి దశలో నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. నాలుగులైన్లుగా అభివృద్ధి చేయటం వలన పట్టణంలోని గ్రామకంఠ భూములను ఆక్రమించుకుని అనుభవిస్తున్న ఆక్రమ కట్టడాలు కూల్చివేయటం ఖాయంగా కనిపిస్తుంది. అలా కాకుండా ప్రస్తుతం పట్టణంలో ఉన్న రహదారిని అలాగే ఉంచి బైపాస్ వేసినట్లయితే వ్యాపారాలు పడిపోతాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు పట్టణంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది.