పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌ | Namitha's next film titled Ahambaavam | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌

Nov 20 2018 4:08 AM | Updated on Nov 20 2018 4:08 AM

Namitha's next film titled Ahambaavam - Sakshi

నమిత

పెళ్లి తర్వాత సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నట్టు కనిపిస్తున్నారు నమిత. తాజాగా ఓ లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌కు సైన్‌ చేశారు. శ్రీమగేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘అగమ్‌పావమ్‌’ చిత్రంలో పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌గా కనిపిస్తారట నమిత. ఈ సినిమా గురించి నమిత మాట్లాడుతూ– ‘‘పొలిటీషియన్‌కు, జర్నలిస్ట్‌కు మధ్య జరిగే కథ ఇది. నేను పవర్‌ఫుల్‌ పాత్ర చేస్తున్నాను. ఈ సినిమాలో అసలు గ్లామర్‌ ఉండదు. కొన్ని రోజులుగా నా బాడీ లాంగ్వేజ్‌ మీద కూడా వర్క్‌ చేస్తున్నాను. ఇందులో డైలాగ్స్‌ కూడా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. క్లైమాక్స్‌లో 30 పేజీల డైలాగ్స్‌ ఉండే భారీ సన్నివేశం ఉంది. క్లైమాక్స్‌ సన్నివేశాలతోనే షూటింగ్‌ను మొదలుపెడుతున్నాం’’ అని పేర్కొన్నారు నమిత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement