journalist role
-
సలార్‌లో శృతీహాసన్ పాత్ర ఇదే..
ప్రశ్నించడం ఎలానో తెలుసుకున్నారట శ్రుతీహాసన్. ఇప్పుడు ప్రశ్నించే పని మీదే ఉన్నారట. ఇంతకీ ఎవర్ని ప్రశ్నిస్తున్నారంటే ‘సలార్’ సినిమా చూడాల్సిందే. ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సలార్’. ఇందులో శ్రుతీహాసన్ పొలిటికల్ జర్నలిస్ట్ పాత్ర చేస్తున్నారని సమాచారం. ఈ పాత్రలో ఒదిగిపోవడానికి జర్నలిస్ట్‌లు ఎలా ప్రశ్నిస్తారు? వారి తీరు ఎలా ఉంటుంది? అనే విషయాలను తెలుసుకుని, చిత్రీకరణలో పాల్గొంటున్నారట. తొలిసారిగా ప్రభాస్–శ్రుతి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ఇది. చదవండి: మోసం అంటున్న అనుపమ, లేపేస్తా అంటున్న ప్రగ్యా -
జర్నలిస్ట్ ప్రకాశ్ రాజ్
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్’ చాప్టర్ 1 ఎంత హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘కేజీఎఫ్’ చాప్టర్ 2’ని ప్యాన్ ఇండియా స్థాయిలో చిత్రీకరిస్తున్నారు. హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌కి కరోనా కారణంగా బ్రేకులు పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి షూటింగ్‌లకు అనుమతి రావడంతో బుధవారం నుంచి ఈ సినిమా షూటింగ్ బెంగళూరులో పునః ప్రారంభమైంది. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రకాష్‌రాజ్ బుధవారం షూటింగ్లో పాల్గొన్న ఫొటోల్ని షేర్ చేసి, ‘కొంత విరామం తర్వాత మళ్లీ షూటింగ్ చేస్తున్నా’ అని పేర్కొన్నారు. తొలి భాగంలో నటుడు అనంత్ నాగ్ పోషించిన జర్నలిస్ట్ ఆనంద్ వాసిరాజు పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారని టాక్. ఇప్పటికే 80శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా 20 శాతం పూర్తి కావాల్సి ఉంది. దక్షిణాదిలోని అన్ని భాషలతో పాటు హిందీలోనూ ఈ సినిమా విడుదల కానుంది. -
పవర్ఫుల్ జర్నలిస్ట్
పెళ్లి తర్వాత సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నట్టు కనిపిస్తున్నారు నమిత. తాజాగా ఓ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్‌కు సైన్ చేశారు. శ్రీమగేశ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘అగమ్పావమ్’ చిత్రంలో పవర్ఫుల్ జర్నలిస్ట్‌గా కనిపిస్తారట నమిత. ఈ సినిమా గురించి నమిత మాట్లాడుతూ– ‘‘పొలిటీషియన్‌కు, జర్నలిస్ట్‌కు మధ్య జరిగే కథ ఇది. నేను పవర్ఫుల్ పాత్ర చేస్తున్నాను. ఈ సినిమాలో అసలు గ్లామర్ ఉండదు. కొన్ని రోజులుగా నా బాడీ లాంగ్వేజ్ మీద కూడా వర్క్ చేస్తున్నాను. ఇందులో డైలాగ్స్ కూడా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. క్లైమాక్స్‌లో 30 పేజీల డైలాగ్స్ ఉండే భారీ సన్నివేశం ఉంది. క్లైమాక్స్ సన్నివేశాలతోనే షూటింగ్‌ను మొదలుపెడుతున్నాం’’ అని పేర్కొన్నారు నమిత. -
సవాల్‌కి రెడీ
ఈ దర్శకులందరికీ ఏమైంది? ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలంటే నయనతార మాత్రమేనా? మేము లేమా? అని ఫీలయ్యేలా నయన చేతిలో సినిమాలున్నాయి. ఇప్పటికే ‘డోరా’, ‘ఇమైక్క నొడిగళ్’, ‘అరమ్’, ‘కొలై ఉదిర్ కాలమ్’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకేసారి ఇన్ని కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలకు అవకాశం రావడం అంటే మాటలు కాదు. అందుకే, నయనతార ‘లేడీ సూపర్ స్టార్’ అని ఆమె అభిమానులు అంటున్నారు. ఇక, తాజాగా అంగీకరించిన సినిమా విషయానికొస్తే... నూతన దర్శకుడు భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. వచ్చే ఏడాది మార్చిలో చిత్రీకరణ ప్రారంభించనున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా సాగే చిత్రం ఇది. ఆ సంఘటనలతో దర్శకుడు ఓ కాల్పనిక కథ తయారు చేశారు. ఇందులో తన కుటుంబాన్ని, మూలాలను వెతుక్కుంటూ వెళ్లే ప్యారిస్‌కి చెందిన జర్నలిస్ట్ పాత్రను నయనతార చేయనున్నారు. జర్మనీ, ఫ్రాన్స్, పోలండ్, మంగోలియాలో 75 శాతం చిత్రీకరణ జరగనుంది. కొండలు, అడవులు, మంచు ప్రాంతాల్లో ఎక్కువ భాగం చిత్రీకరిస్తారు. ముఖ్యంగా మంగోలియా షెడ్యూల్ పెద్ద సవాల్ అని భరత్ కృష్ణమాచారి చెబుతూ – ‘‘మంగోలియాలోని మంచు ప్రదేశాల్లో చిత్రీకరించనున్నాం. పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో షూటింగ్ చేస్తాం. ఇలాంటి వాతావరణంలో షూటింగ్ చేయడానికి నయనతారకు ఇష్టం లేకపోయినప్పటికీ కథ, నచ్చి ఓకే చెప్పేశారు. సౌత్‌లో నయనతారకు చాలా పెద్ద సినిమా అవుతుంది. ఈ సినిమా ఆమె మాత్రమే చేయగలుగుతారు. రిస్కీ వాతావరణం, రిస్కీ ఫైట్స్...ఇలా ఈ సినిమా కోసం ఎన్ని రిస్కులు చేయడానికైనా ఆమె రెడీ అయ్యారు’’ అన్నారు.