సవాల్‌కి రెడీ | Nayanthara to play Paris journalist role | Sakshi
Sakshi News home page

సవాల్‌కి రెడీ

Published Thu, Dec 29 2016 11:36 PM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM

సవాల్‌కి రెడీ

సవాల్‌కి రెడీ

ఈ దర్శకులందరికీ ఏమైంది? ఫీమేల్‌ ఓరియంటెడ్‌ సినిమాలంటే నయనతార మాత్రమేనా? మేము లేమా? అని ఫీలయ్యేలా నయన చేతిలో సినిమాలున్నాయి. ఇప్పటికే ‘డోరా’, ‘ఇమైక్క నొడిగళ్‌’, ‘అరమ్‌’, ‘కొలై ఉదిర్‌ కాలమ్‌’ వంటి లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు చేస్తున్నారు. తాజాగా మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఒకేసారి ఇన్ని కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలకు అవకాశం రావడం అంటే మాటలు కాదు. అందుకే, నయనతార ‘లేడీ సూపర్‌ స్టార్‌’ అని ఆమె అభిమానులు అంటున్నారు. ఇక, తాజాగా అంగీకరించిన సినిమా విషయానికొస్తే... నూతన దర్శకుడు భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. వచ్చే ఏడాది మార్చిలో చిత్రీకరణ ప్రారంభించనున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా సాగే చిత్రం ఇది. ఆ సంఘటనలతో దర్శకుడు ఓ కాల్పనిక కథ తయారు చేశారు.

ఇందులో తన కుటుంబాన్ని, మూలాలను వెతుక్కుంటూ వెళ్లే ప్యారిస్‌కి చెందిన జర్నలిస్ట్‌ పాత్రను నయనతార చేయనున్నారు. జర్మనీ, ఫ్రాన్స్, పోలండ్, మంగోలియాలో 75 శాతం చిత్రీకరణ జరగనుంది. కొండలు, అడవులు, మంచు ప్రాంతాల్లో ఎక్కువ భాగం చిత్రీకరిస్తారు. ముఖ్యంగా మంగోలియా షెడ్యూల్‌ పెద్ద సవాల్‌ అని భరత్‌ కృష్ణమాచారి చెబుతూ – ‘‘మంగోలియాలోని మంచు ప్రదేశాల్లో చిత్రీకరించనున్నాం. పది డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో షూటింగ్‌ చేస్తాం. ఇలాంటి వాతావరణంలో షూటింగ్‌ చేయడానికి నయనతారకు ఇష్టం లేకపోయినప్పటికీ కథ, నచ్చి ఓకే చెప్పేశారు. సౌత్‌లో నయనతారకు చాలా పెద్ద సినిమా అవుతుంది. ఈ సినిమా ఆమె మాత్రమే చేయగలుగుతారు. రిస్కీ వాతావరణం, రిస్కీ ఫైట్స్‌...ఇలా ఈ సినిమా కోసం ఎన్ని రిస్కులు చేయడానికైనా ఆమె రెడీ అయ్యారు’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement