కీర్తి సురేష్‌ సినిమా షూటింగ్‌ వాయిదా! | Keerthy Suresh New Project Shooting May Postponed | Sakshi
Sakshi News home page

కీర్తి సురేష్‌ సినిమా షూటింగ్‌ వాయిదా!

Published Mon, Feb 11 2019 9:03 AM | Last Updated on Mon, Feb 11 2019 9:05 AM

Keerthy Suresh New Project Shooting May Postponed - Sakshi

‘మహానటి’ తరువాత తెలుగులో మరే చిత్రానికి అంగీకరించని కీర్తి సురేష్‌.. ఆ మధ్య ఓ లేడీ ఓరియెంటెడ్‌ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది ఆ చిత్రం. అయితే ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ వాయిదాపడ్డట్టు తెలుస్తోంది.

ఫిబ్రవరి 14న ప్రారంభించాల్సిన షూటింగ్‌.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదాపడ్డట్లు సమాచారం. మళ్లీ త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. మహేష్‌ కోనేరు నిర్మాతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా.. కళ్యాణీ మాలిక్‌ సంగీతాన్ని సమకూర్చనున్నారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రంతో నరేంద్ర అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement