అమెరికాలో అంజలి... | Anjali In America | Sakshi
Sakshi News home page

అమెరికాలో అంజలి...

Published Sat, Dec 20 2014 11:21 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

అమెరికాలో అంజలి... - Sakshi

అమెరికాలో అంజలి...

 ‘గీతాంజలి’ చిత్రం తర్వాత తమిళంలో మూడు సినిమాలు అంగీకరించిన అంజలి తెలుగులో ఒకే ఒక్క చిత్రానికి మాత్రమే పచ్చజెండా ఊపారు. ఈ మధ్యకాలంలో తెలుగులో బోల్డన్ని కథలు విన్న అంజలికి ఈ ఒక్క కథ మాత్రమే నచ్చిందట. ‘పిల్ల జమిందారు’ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో శ్రీ విఘ్నేశ్ కార్తీక్ సినిమా పతాకంపై ఈ చిత్రాన్ని గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రవిశేషాలను నిర్మాత చెబుతూ -‘‘అంజలి నటిస్తున్న మరో లేడీ ఓరియంటెడ్ మూవీ ఇది. ఓ భిన్నమైన కథాంశంతో సాగే కామెడీ థ్రిల్లర్. నవంబర్ 18న అమెరికాలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించాం. జనవరి 10 వరకు అక్కడ షూటింగ్ చేసి, ఆ తర్వాత హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ మొదలుపెడతాం’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement