
పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ మూవీలతో హ్యాట్రిక్ కొట్టిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. రీసెంట్‌గా సంక్రాంతి బరిలో విన్నర్‌గా నిలిచాడు. బడా సినిమాలకు పోటీగా తెచ్చిన ‘ఎఫ్2’ అందరి అంచనాలను తలకిందులు చేసి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో టాలీవుడ్‌లో అనిల్ రావిపూడి హవా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ డైరెక్టర్ తదుపరి ప్రాజెక్ట్‌పైనే అందరి దృష్టి నెలకొంది.
‘ఎఫ్2’ సక్సెస్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ఎఫ్2కి సీక్వెల్‌చేస్తానని ప్రకటించాడు. అప్పట్లో బాలయ్యతో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం అనిల్.. ఓ లేడీ ఓరియెంటెడ్ కథను సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ఈ మూవీ కూడా తన స్టైల్లోనే మంచి కమర్షియల్ ఫార్మాట్‌లోనే ఉంటుందా.. అసలు ఈ ప్రాజెక్ట్ అనిల్ మనసులో ఉందో లేదో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.