ఇండస్ట్రీలో 17 ఏళ్లుగా నటిగా కొనసాగుతున్నారు శ్రియ. ఈ ప్రయాణంలో నటిగా చాలెంజింగ్, ఇంట్రస్టింగ్ పాత్రలు ఎంచుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చాను అన్నారామె. పాత్రల ఎంపిక విషయం గురించి శ్రియ మాట్లాడుతూ – ‘‘ఓ ఆర్టిస్ట్‌కి అతి కష్టమైన పని పాత్రల ఎంపిక విషయంలో బ్యాలెన్డ్స్‌గా ఉండటం. అటు కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే కంటెంట్ ఉన్న సినిమాల్లో కనిపిస్తూనే ఉండాలి. నిర్మాత ఖర్చు పెట్టింది తిరిగిరావడంతో పాటు కొంత లాభం తీసుకొచ్చినప్పుడే ఆ సినిమా సక్సెస్ అయినట్టు.
అలాగే మన పాత్ర ఆసక్తికరంగా ఉందా లేదా? నటిగా మనకేమైనా ఆ పాత్ర కొత్త చాలెంజ్ ఇస్తుందా? అన్నది కూడా ముఖ్యం. పాత్ర ఎంపికలో ఈ రెండూ అవసరమే. స్క్రిప్ట్ సరిగ్గా కుదిరితే అన్నీ సక్రమంగా జరిగిపోతాయి. కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీసుకుంటే అందులోనూ ఆ హీరోయిన్‌ని కాపాడటానికి చివరికి ఎవరో ఒక మగాడు (హీరో) వస్తాడు. ఆ సినిమాల్లో కూడా హీరో రావాల్సిందేనా? సో.. నాకు ఏ సినిమా అయినా ఒకటే. స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్న స్క్రిప్ట్‌కి ఎప్పుడూ రెడీ’’ అని అన్నారు.
అక్కడ కూడా హీరో రావాల్సిందేనా?
Published Wed, Oct 24 2018 12:39 AM | Last Updated on Wed, Oct 24 2018 12:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment