కోకిల సాహసం | Nayantara CoCo Kokila to release on August 31 | Sakshi
Sakshi News home page

కోకిల సాహసం

Published Sun, Aug 26 2018 2:23 AM | Last Updated on Sun, Aug 26 2018 2:23 AM

Nayantara CoCo Kokila to release on August 31 - Sakshi

నయనతార

మాయ, డోర, ఆరమ్, అనామిక.. వంటి లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌తో ‘లేడీ సూపర్‌ స్టార్‌’ అనిపించుకున్నారు నయనతార. ఆమె తమిళంలో  టైటిల్‌ రోల్‌ చేసిన మరో లేడీ ఓరియంటెడ్‌ మూవీ ‘కోలమావు కోకిల’. ఈ చిత్రం తెలుగులో ‘కో.. కో.. కోకిల’ పేరుతో విడుదల కానుంది. లైకా ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయనుంది. నెల్సన్‌ దర్శకుడు. ఈ చిత్రం గురించి లైకా ప్రొడక్షన్స్‌ ప్రతినిధులు మాట్లాడుతూ – ‘‘తమిళంలో ఇటీవల విడుదలైన ‘కోలమావు కోకిల’ సెన్సేషనల్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళుతోంది. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్, స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌తో పాటు బాలీవుడ్‌ దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని ప్రశంసించారు.

ఓ సాధారణమైన అమ్మాయి అనుకోకుండా ఒక స్మగ్లింగ్‌ గ్యాంగ్‌ చేతిలో చిక్కుకుపోతుంది. వాళ్ల నుంచి బయటపడటానికి కోకిల చేసిన సాహసం ఏంటి? అనే  పాయింట్‌ను డైరెక్టర్‌ నెల్సన్‌ ఆసక్తికరంగా తెరకెక్కించారు. నయనతార అద్భుతమైన నటి. ఇప్పటివరకూ ఆమె చేసిన చిత్రాలు అందుకు నిదర్శనం. ఈ చిత్రంలో కోకిల పాత్రలో విజృంభించారామె. శివకుమార్‌ విజయన్‌ సినిమాటోగ్రఫీ, అనిరుధ్‌ రవిచంద్రన్‌ మ్యూజిక్, నెల్సన్‌ టేకింగ్‌ పెద్ద ఎసెట్‌గా నిలిచాయి. ఈ నెల 31న తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నాం. తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement