
కియారా అద్వానీ.
... అని పాడుతున్నారు కియారా అద్వానీ. బాయ్‌ఫ్రెండ్ కావాలని పాడటమే కాదు ప్రేమలో పడటానికి రెడీగా ఉన్నానంటున్నారు. బాయ్‌ఫ్రెండ్ కోసం డేటింగ్ యాప్స్ అన్నీ కాచి వడపోస్తున్నారు. ఇదంతా కియారా కొత్త సినిమా ‘ఇందూ కీ జవానీ’ కోసమే. కియారా లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాకు అబీర్ సేన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. టీ–సిరీస్, ఎమ్మీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం లక్నోలో జరుగుతోంది. ఇందు పాత్ర చేయడం గురించి కియారా మాట్లాడుతూ – ‘‘ఇందు పాత్ర చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ పాత్రకు ప్రతీ అమ్మాయి కనెక్ట్ అవుతుంది. హాయిగా నవ్వుకునే ఎంటర్‌టైనర్ ఇది’’ అని పేర్కొన్నారు. ఇదే కియారా మొదటి లేడీ ఓరియంటెడ్ చిత్రం.
Comments
Please login to add a commentAdd a comment