కొత్త సవాల్‌ | Anupama Parameswaran Next Movie Is Lady Oriented | Sakshi
Sakshi News home page

కొత్త సవాల్‌

Published Tue, Mar 17 2020 12:43 AM | Last Updated on Tue, Mar 17 2020 12:43 AM

Anupama Parameswaran Next Movie Is Lady Oriented - Sakshi

అనుపమా పరమేశ్వరన్‌

అన్నీ కుదిరితే అనుపమా పరమేశ్వరన్‌ ఓ లేడీ ఓరియంటెడ్‌ సినిమాలో నటించబోతున్నారని తెలిసింది.. ‘అఆ’, ‘ప్రేమమ్‌’ చిత్రాల్లో కీలక పాత్రలు చేసి, ‘శతమానం భవతి’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘హలో గురూ ప్రేమ కోసమే’ వంటి హిట్‌ చిత్రాల్లో కథానాయికగా నటించారు ఈ మలయాళ కుట్టి. గత ఏడాది హిట్‌ మూవీ ‘రాక్షసుడు’లో కనిపించిన అనుపమ ప్రస్తుతం ఓ మలయాళ సినిమా, ఓ తమిళ చిత్రం చేస్తున్నారు. త్వరలో ఓ తెలుగు సినిమా సైన్‌ చేయనున్నారట. ఇది లేడీ ఓరియంటెడ్‌ మూవీ అని సమాచారం.

ఒకవేళ ఈ వార్త నిజమైతే అనుపమ చేయబో తున్న తొలి కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా ఇదే అవుతుంది. హనుమాన్‌ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని భోగట్టా. ఇప్పటివరకూ చేసినవన్నీ హీరో ఓరియంటెడ్‌ సినిమాలే అయినా వాటిలో మంచి పాత్రలే చేశారు అనుపమ. తనలో మంచి నటి ఉందని నిరూపించుకున్నారు. ఇప్పుడు లేడీ ఓరియంటెడ్‌ మూవీ అంటే సవాల్‌ అయినా అనుపమ ఈ స్టెప్‌లోనూ సక్సెస్‌ అవుతారని చెప్పొచ్చు. పీవీపీ బేనర్‌లో ఈ సినిమా రూపొందనుందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement