వైవిధ్యమైన పాత్రలో.. | Nayanthara's next, Kolamaavu Kokila | Sakshi
Sakshi News home page

వైవిధ్యమైన పాత్రలో..

Published Sat, May 19 2018 6:34 AM | Last Updated on Sat, May 19 2018 10:15 AM

Nayanthara's next, Kolamaavu Kokila - Sakshi

కోలీవుడ్‌లో వరుస ఆఫర్లతో యమా బిజీగా ఉన్నారు నయనతార. ఓ వైపు హీరోల సరసన నటిస్తూనే, మరోవైపు లేడీ ఓరియంటెండ్‌ చిత్రాలతోనూ బాక్సాఫీస్‌ వద్ద తన సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకూ పలు పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ ‘కొలమావు కోకిల’ (కో కో ) సినిమాలో ఇప్పటి వరకూ చేయని పాత్ర చేస్తున్నారట. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయన్‌ డ్రగ్స్‌ అమ్మే యువతిగా కనిపిస్తారట. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఓ యువతి స్మగ్లింగ్‌ వైపు ఎలా వెళ్లింది? ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందట.  నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కథ చెప్పగానే మరోమాట మాట్లాడకుండా నటించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారట నయనతార. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా, ప్రస్తుతం నయనతార తెలుగులో ‘సైరా’ చిత్రంలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement