మధ్యతరగతి గృహిణి | Pooja Kumar signs Priyadarshan's 'The Invisible Mask' | Sakshi
Sakshi News home page

మధ్యతరగతి గృహిణి

Published Tue, Oct 16 2018 1:25 AM | Last Updated on Tue, Oct 16 2018 1:25 AM

Pooja Kumar signs Priyadarshan's 'The Invisible Mask' - Sakshi

పూజా కుమార్‌

కమల్‌హాసన్‌ ‘విశ్వరూపం’ సీరీస్‌తో సౌత్‌ ఆడియన్స్‌కు బాగా పరిచయమైన నటి పూజా కుమార్‌. ఆ తర్వాత ‘పీయస్‌వీ గరుడ వేగ’ సినిమాలో రాజశేఖర్‌కి జోడీగా నటించారీ బ్యూటీ. ప్రస్తుతం ఓ లేడీ ఓరియంటెడ్‌ చిత్రానికి సిద్ధం అయ్యారు పూజా. కానీ, ఇది పూర్తిస్థాయి సినిమా కాదు. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్, నెట్‌ఫ్లిక్స్‌ నిర్మించబోయే ‘ఇన్విసిబుల్‌ మాస్క్‌’ అనే ఆంతాలజీలో (నాలుగు షార్ట్‌ ఫిల్మ్స్‌ కలిపి ఒక సినిమాలా) ఓ చిన్న భాగాన్ని డైరెక్ట్‌ చేయనున్నారు. ప్రియదర్శన్‌ తెరకెక్కించబోయే పార్ట్‌లో పూజా కుమార్‌ మెయిన్‌ లీడ్‌లో కనిపించనున్నారు. ఇందులో ఆమె ఓ మధ్య తరగతి గృహిణి పాత్రలో కనిపించనున్నారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement