సీనియర్ నటి జమున(86) ఇక లేరనే వార్తను తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె నటించిన సినిమాలు.. పోషించిన పాత్రలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. ముఖ్యంగా ఆమె నటించిన సత్యభామ పాత్ర గురించి అందరూ చర్చించుకుంటున్నారు. వినాయ చవితి, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ విజయం సినిమాల్లో ఆమె సత్యభామ పాత్రని పోషించి, తనదైన నటనతో అందరిని ఆకట్టుకుంది.
(చదవండి: టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటి జమున కన్నుమూత)
అయితే రెండోసారి సత్యభామ పాత్రలో నటిస్తున్నానంటే.. చాలా మంది ఆమెకు వద్దని చెప్పారట. మరికొంత మంది అయితే ‘లావైపోయింది..సత్యభామగా ఆమె ఏం బాగుంటుంది’ అని అన్నారట. అయినా కూడా అవేవి పట్టించుకోకుండా ‘సత్యభామ’గా నటించి ఆ పాత్రను నేనే కరెక్ట్ అని అనిపించుకున్నానని ఓ ఇంటర్వ్యూలో జమున అన్నారు.
(చదవండి: అందాల చందమామ.. తెలుగు తెర ‘సత్యభామ’)
సత్యభామ పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ..‘వినాయక చవితి’ సినిమాలో అమాయకత్వం నిండిన సత్యభామగా చేశాను. నాకు పెళ్లి అవ్వక ముందు చేసిన సినిమా అది. ఆ తర్వాత పెళ్లయిన కొత్తలో ‘శ్రీకృష్ణ తులాభారం’లో సత్యభామగా చేసే అవకాశం వచ్చింది. ‘పెళ్లయింది కదా. లావయ్యుంటుంది. ఏం బాగుంటుంది’ అని కొంతమంది అన్నారు. ‘ఏం పెళ్లయితే లావైపోతామా?’ అనుకున్నాను. చెప్పాలంటే పెళ్లి తర్వాత ఇంకా పరిణతి వచ్చి, నా అందం రెట్టింపు అయింది. అప్పుడు సత్యభామగా నన్ను చూసి, అందరూ భేష్ అన్నారు. మూడోసారి ‘శ్రీకృష్ణ విజయం’లో ఆ పాత్ర చేసినప్పుడు బిడ్డల తల్లిని. అయినా నా అందం, ఆహార్యం చెక్కు చెదరలేదు. అలా సత్యభామగా నేనే కరెక్ట్ అనే పేరు తెచ్చుకోగలిగాను’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment