టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి జమున(86)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఉదయం 11 గంటలకు ఫిల్మ్ చాంబర్‌కు జమున భౌతికకాయాన్ని తీసుకురానున్నారు. 1936 ఆగస్టు 30న హంపీలో జన్మించిన జమున 1953లో 'పుట్టిల్లు' అనే సినిమాతో తెరంగేట్రం చేశారు. సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు.
ఆమె పోషించిన సత్యభామ పాత్ర జమునకు మంచి పేరు తీసుకువచ్చింది. 'సినిమా సత్యభామ'గా జమునకు పేరుంది. మిస్సమ్మ సినిమా జమున కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. అలనాటి అగ్రనటులు అందరితోనూ నటించారామె.
గుండమ్మ కథ, మిస్సమ్మ ఇల్లరికం, ఇలవేల్పు, లేత మనసులు సహా సుమారు 200కు పైగా సినిమాల్లో నటించారు. 1964, 1968లో ఉత్తమ సహాయ నటిగా జమునకు ఫిల్మ్ ఫేర్‌అవార్డులు అందుకున్న జమునకు 2008లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం దక్కింది. వైవిధ్యమైన పాత్రలతో అలరించిన జమున మృతి టాలీవుడ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది.ఇక పొలిటికల్ కెరీర్ విషయానికి వస్తే.. 1989లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కొంతకాలానికే ఆమె రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment