‘సత్యభామ’ ప్రాజెక్ట్ చేయాలని ఫిక్స్ అయిన తర్వాత హీరోయిన్ కోసం మూడు నాలుగు ఆప్షన్స్ పెట్టుకున్నాం. ఫస్ట్ అనుకున్నది కాజల్ నే. ఆమె నో చెబితే నెక్ట్ ఆప్షన్స్ కు వెల్దామని అనుకున్నాం. అయితే కథ విన్న వెంటనే ఆమె ఓకే చెప్పారు. మేము ఫస్ట్ టైమ్ ఈ కథ విన్నప్పుడు మాలో ఎలాంటి ఎగ్జైట్ మెంట్ కలిగిందో కాజల్ కూడా అలాగే ఫీలయ్యారు. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ లో "సత్యభామ" గుర్తుండిపోయే సినిమా అవుతుంది’అని అన్నారు నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ఈ నెల 7న ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
⇢ గూఢచారి, మేజర్ సినిమాల దర్శకుడు శశికిరణ్ తిక్క బాబీ తిక్క బ్రదర్. ఆయన ఇండస్ట్రీలో ఉన్నారనే మేము ప్రొడక్షన్ లోకి వచ్చాం. అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ లో తొలి ప్రయత్నంగా "సత్యభామ" సినిమాను నిర్మించాం. మంచి కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది మా ఉద్దేశం. దీంతో పాటు యంగ్ టాలెంట్ కు కూడా అవకాశాలు ఇస్తున్నాం. మా దర్శకుడు సుమన్ కు ఇది మొదటి సినిమా. మ్యూజిక్ బ్యాండ్స్ లో పాడే సింగర్స్ ను ఐడెంటిఫై చేసి వారికి రెండు పాటలు పాడే అవకాశం ఇచ్చాం.
⇢ ఒక ఇరవై ఏళ్ల క్రితం యూకే జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ బేస్ గా చేసుకుని "సత్యభామ" సినిమా లైన్ రెడీ చేశాం. అయితే పూర్తిగా మన నేటివిటీకీ మార్పులు చేసిన కథను సిద్ధం చేశాం. "సత్యభామ" సినిమా అనౌన్స్ చేసినప్పుడు మీరు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ఎందుకు చేస్తున్నారు హీరోతో చేయొచ్చుక దా అని అడిగారు. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ లో మనకు విజయశాంతి కర్తవ్యం లాంటి మూవీస్ కొన్నే గుర్తుంటాయి. "సత్యభామ"లో కాజల్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది.
⇢ "సత్యభామ" సినిమా సెన్సార్ బృందంలో మహిళలు మా మూవీని బాగా అభినందించారు. షీ సేఫ్ యాప్ కేవలం 5 వేల మంది మాత్రమే డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇంకా దీని మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మా సినిమాలో ఈ యాప్ ప్రస్తావన ఉంటుంది. షీ సేఫ్ యాప్ కు పనిచేసే మహిళల్ని వారి ఫ్యామిలీతో సహా మా మూవీ స్పెషల్ షోకు ఆహ్వానిస్తున్నాం. శశి తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన కథలనే మేము అవురమ్ ఆర్ట్స్ లో చూపించబోతున్నాం. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.
⇢ కాజల్ మా మూవీ షూటింగ్ టైమ్ లో ఎంతో సపోర్ట్ చేశారు. మా టీమ్ ఆమెకు నచ్చింది. అవురమ్ ఆర్ట్స్ నా సొంత బ్యానర్ అని ఆమె చెప్పడం మాకెంతో హ్యీపీనెస్ ఇచ్చింది. మా మూవీని ముందు తెలుగులో సక్సెస్ ఫుల్ గా చేసి ఆ తర్వాత మిగతా భాషల విషయం ఆలోచిస్తాం. మా నెక్ట్ మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తాం.
Comments
Please login to add a commentAdd a comment