ట్రెండ్‌ మారింది.. పెళ్లయిన హీరోయిన్స్‌ బిజీ అయ్యారు: కాజల్‌ | Kajal Aggarwal Talk About Satyabhama Movie | Sakshi
Sakshi News home page

Kajal Aggarwal : ట్రెండ్‌ మారింది.. పెళ్లయిన హీరోయిన్స్‌ బిజీ అయ్యారు

Published Wed, Jun 5 2024 6:25 PM | Last Updated on Thu, Jun 6 2024 11:40 AM

Kajal Aggarwal Talk About Satyabhama Movie

‘పెళ్లయ్యాక ఒక హీరోయిన్ కెరీర్ ఎందుకు మారాలో అర్థం కాదు. అందరికీ పర్సనల్ లైఫ్ ఉంది. అలాగే హీరోయిన్స్‌కి కూడా. గతంలో పెళ్లయ్యాక హీరోయిన్స్ కు అవకాశాలు తగ్గుయోమో..ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లయ్యాక ఎంతోమంది హీరోయిన్స్ అంతకముందు కంటే బిజీగా సినిమాలు చేస్తున్నారు’అన్నారు కాజల్‌ అగర్వాల్‌. ఆమె పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సత్యభామ’. నవీన్ చంద్ర  కీలక పాత్రను పోషించారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా కాజల్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

నేను ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్స్ చేశాను గానీ సత్యభామ సినిమా లాంటి ఎమోషనల్ మూవీ చేయడం ఇదే తొలిసారి. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా చేశాను. ఈ చిత్రంలో నటిస్తుంటే ఇప్పటిదాకా ఫీల్ కాని కొన్ని ఎమోషన్స్ అనుభూతిచెందాను. అవన్నీ మీకూ రియలిస్టిక్ గా అనిపిస్తాయి.

నన్ను చాలాకాలం టాలీవుడ్ చందమామ అని పిలిచేవారు. ఇప్పుడు సత్యభామ అని పిలిచినా సంతోషిస్తాను. నాకు రెండూ కావాలి. చందమామ బ్యూటిఫుల్ నేమ్, సత్యభామ పవర్ ఫుల్ నేమ్. నాకు రెండూ ఇష్టమే. ఈ కథ చెప్పినప్పుడు ఇన్ స్టంట్ గా ఓకే చెప్పాను. అంతలా నచ్చిందీ స్టోరి.

శశికిరణ్ మంచి డైరెక్టర్. ఆయన సినిమాలు చూశాను. ఈ సినిమాకు డైరెక్షన్ ఎందుకు చేయడం లేదని శశిని అడిగాను. ఆయన తను ఈ మూవీకి స్క్రీన్ ప్లే ఇస్తూ ప్రెజెంటర్ గా ఉంటున్నానని చెప్పారు. మనం ఎప్పుడూ ఒకే పనిచేయనక్కర్లేదు. డిఫరెంట్ జాబ్స్ ఎక్స్ ప్లోర్ చేయాలి. శశి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించా. ఆయన ఈ ప్రాజెక్ట్ ను అన్ని విధాలా బాగా వచ్చేలా చూసుకున్నారు.

దర్శకుడు సుమన్ చిక్కాల ఫస్ట్ టైమ్ డైరెక్షన్ చేస్తున్నా..ఎంతో కన్విక్షన్ తో వర్క్ చేశారు. ఆయనకు చాలా క్లారిటీ ఉంది. తను అనుకున్న స్క్రిప్ట్ అనుకున్నట్లు రూపొందించాడు. సుమన్ చిక్కాలతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మా ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్లైనా తమ ఫస్ట్ మూవీని ఓ బేబిని చూసుకున్నట్లు చూసుకున్నారు. ప్రతి రోజూ సెట్ లో ఉంటూ అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యేవారు. తొలి సినిమాను ఎంతో జాగ్రత్తగా ప్రొడ్యూస్ చేశారు.

గతంలో జిల్లా సినిమాలో పోలీస్ గెటప్ లో కనిపించా. అయితే అది సీరియస్ నెస్ ఉన్న రోల్ కాదు. సత్యభామలో మాత్రం ఎమోషన్, యాక్షన్ ఉన్న పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తా. పోలీస్ రోల్స్ గతంలో ఎంతోమంది హీరోయిన్స్ చేసి ఉంటారు. కానీ ఇది నాకు కొత్త. నా తరహాలో పర్ ఫార్మ్ చేశాను. మీకు నచ్చుతుందనే ఆశిస్తున్నా.

సత్యభామలో యాక్షన్ సీక్వెన్సుల కోసం ఎంతో కష్టపడ్డా. ఆ ఫైట్స్ అన్నీ రియలిస్టిక్ గా ఉంటాయి. నేను రామ్ చరణ్ లా వంద మందిని కొడితే ప్రేక్షకులు నమ్మరు. నా ఇమేజ్ కు ప్రేక్షకులు ఇష్టపడేలా స్టంట్స్ ఉంటాయి. సుబ్బు యాక్షన్ సీక్వెన్సులు కొరియోగ్రాఫ్ చేశారు.

యూత్, బెట్టింగ్ తో పాటు ఓ రిలీజియన్ గురించి సత్యభామలో కీ పాయింట్స్ ఉంటాయి. అయితే ఏ మతానికి పాజిటివ్ గా నెగిటివ్ గా ఏదీ చెప్పడం లేదు. జస్ట్ ఆ అంశం కథలో ఉంటుంది అంతే. మీరు ట్రైలర్ చూసిన దాని కంటే ఎన్నో ట్విస్ట్ లు, టర్న్స్ మూవీలో ఉంటాయి. అవన్నీ మూవీలో చూసి మీ రెస్పాన్స్ కు చెబుతారని కోరుకుంటున్నా.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల తన బెస్ట్ ఎఫర్ట్స్ సత్యభామ కోసం పెట్టాడు. మా ఇద్దరికీ రాక్ మ్యూజిక్ అంటే ఇష్టం. మేము ఆ పాటల గురించి, మ్యూజిక్ గురించి మాట్లాడుకునేవాళ్లం.

నేను నా వ్యక్తిగతమైన లైఫ్ ను కెరీర్ ను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఇది కష్టమైన పనే. కానీ నటన అంటే ప్యాషన్ కాబట్టి కష్టమైన ఇష్టంగా చేసుకుంటూ వస్తున్నా. ఈ జర్నీలో మా వారి సపోర్ట్, నా ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో ఉంది. సౌత్ లో నాతో పాటు సమంత, రాశీ ఖన్నా మా ఆయనకు ఫేవరేట్ హీరోయిన్స్.

భారతీయుడు 2 సినిమా రిలీజ్ కోసం ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నా. భారతీయుడు 3లో నా క్యారెక్టర్ ఉంటుంది. ఈ సినిమాలో నేను చాలా కొత్తగా డిఫరెంట్ రోల్ లో కనిపిస్తా.

వైవిధ్యమైన మూవీస్ చేస్తూ నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. కొత్త దర్శకులతోనూ పనిచేస్తా. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. ఏ రంగంలోనైనా కొత్త వారిని ఎంకరేజ్ చేయాలి. ప్రస్తుతం రెండు కొత్త సినిమాలు సైన్ చేశా. వాటి డీటెయిల్స్ ప్రొడక్షన్ కంపెనీస్ అనౌన్స్ చేస్తాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement