డూప్‌ లేకుండా కాజల్‌ యాక్షన్‌.. భయపడ్డాం: దర్శకుడు సుమన్‌ | Suman Chikkala Talk About Kajal Agarwal Satyabhama Movie | Sakshi
Sakshi News home page

డూప్‌ లేకుండా కాజల్‌ యాక్షన్‌.. భయపడ్డాం: దర్శకుడు సుమన్‌

Published Sat, Jun 1 2024 8:09 PM | Last Updated on Sat, Jun 1 2024 8:51 PM

Suman Chikkala Talk About Kajal Agarwal Satyabhama Movie

‘సత్యభామ కథలో ఎమోషన్, యాక్షన్ రెండూ ఉన్నాయి. ఈ కథ రాసేప్పుడు ఇది హీరోకా హీరోయిన్ కా అనేది ఆలోచించలేదు. ఒక పర్సన్ కోసం అని రాస్తూ వచ్చాం. కథలో అమ్మాయి విక్టిమ్ గా ఉంటుంది కాబట్టి ఫీమేల్ అయితే బాగుంటుంది అనిపించింది. ఎమోషన్, యాక్షన్ రెండూ కాజల్ చేయగలరు అని నమ్మాం. ఎమోషన్ పండించడంలో తనకు మంచి పేరుంది. యాక్షన్ చేస్తే కొత్తగా ఉంటుంది.  యాక్షన్ పార్ట్స్ కోసం ఆమె ఎంతో కష్టపడ్డారు. డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్సులు చేశారు. మేం చాలా భయపడ్డాం’అని అన్నారు దర్శకుడు సుమన్ చిక్కాల.కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. జూన్‌ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు సుమన్‌ చిక్కాల మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

నాకు సినిమాలంటే ప్యాషన్. రైటింగ్ వైపు ఆసక్తి ఉండేది. నేను ఉద్యోగం చేస్తూనే చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించాను. కొన్ని హిట్ సినిమాలకు స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొన్నాను. శశికిరణ్ నాకు మంచి మిత్రుడు. ఆయన సినిమాలకు స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేశాను.  ఈ సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యత నాకు అప్పగించాడు శశి. అలా ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నా. దర్శకుడిగా మారేందుకు శశి ఎంతో కష్టపడ్డాడు. తన సక్సెస్ నుంచి యంగ్ టాలెంట్ జర్నీ మొదలుపెట్టాలని అవురమ్ ఆర్ట్స్ స్థాపించాడు. కొందరికైనా కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వగలుగుతాం అనేది ఆయన ఆలోచన. శశి వల్లే నేను దర్శకుడిగా మారాను.

కొందరు పోలీస్ ఆఫీసర్స్ తాము టేకప్ చేసిన కేసుల విషయంలో ఎమోషనల్ గా పనిచేస్తారు. అలా "సత్యభామ" ఒక కేసు విషయంలో పర్సనల్ గా తీసుకుంటుంది, ఎమోషనల్ అవుతుంది. బాధితురాలికి న్యాయం చేసేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమవుతుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక అమ్మాయికి  సాయం చేసే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కాజల్ క్యారెక్టర్ కు ప్రేక్షకులంతా కనెక్ట్ అవుతారు.

‘సత్యభామ"లో నవీన్ చంద్ర కీ రోల్ చేస్తున్నారు. కాజల్ పెయిర్ గా ఆయన కనిపిస్తారు. నవీన్ చంద్రది రైటర్ క్యారెక్టర్. కాజల్ కు సపోర్ట్ గా ఉంటారు. కాజల్ ఒక వారం పది రోజుల షూటింగ్ తర్వాత మా టీమ్ మెంబర్ గా మారిపోయారు. తను ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయి నటించారు. మాకు కూడా ఒక స్టార్ సెట్ లోకి వస్తున్న ఫీలింగ్ ఏరోజూ కలగలేదు.

ఏపీలో దిశా యాప్ ఉంటుంది. తెలంగాణలో షీ సేఫ్ యాప్ ఉంది. మహిళలు తమకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఈ యాప్ లో నెంబర్ టైప్ చేసి సెండ్ చేస్తే వారి లొకేషన్ షీ టీమ్స్ కు వెళ్లిపోతుంది. వాళ్లు కాపాడేందుకు వస్తారు. మేము సెట్ లో ఉన్నప్పుడు  యాప్స్ రెస్పాండ్ అవుతాయా లేదా అని చెక్ చేసి చూశాం. మాకు షీ టీమ్స్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. "సత్యభామ" చూస్తున్నప్పుడు మహిళలు ఎవరైనా ఈ యాప్స్ గురించి తెలుసుకుని తమ లైఫ్ లో వాడితే వారికి మా సినిమా ద్వారా ఒక మెసేజ్ చేరినట్లే.

"సత్యభామ" పూర్తిగా ఫిక్షన్ కథ. నాకు పోలీస్ డైరీస్ గురించి తెలుసుకోవడం, వారి ఇంటర్వ్యూలు వినడం అలవాటు. అలా కొందరు పోలీసుల లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ స్ఫూర్తితో ఈ కథను డెవలప్ చేశాం. ముందు మా మూవికి ఈ పేరు లేదు. అయితే సత్యభామ అనే పేరు మన పౌరాణికాల్లో పవర్ ఫుల్ నేమ్. అందరికీ త్వరగా రీచ్ అవుతుందని ఆ పేరు పెట్టాం.ప్రస్తుతం కొన్ని కథలు ఉన్నాయి. త్వరలో నా నెక్ట్ మూవీ అనౌన్స్ చేస్తా.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement