క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. సత్యభామ టీజర్‌ చూశారా? | Kajal Aggarwal Satyabhama Teaser Out Now | Sakshi
Sakshi News home page

Satyabhama Teaser:క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. సత్యభామ టీజర్‌ చూశారా?

Published Fri, Nov 10 2023 2:43 PM | Last Updated on Fri, Nov 10 2023 2:52 PM

Kajal Aggarwal Satyabhama Teaser Out Now - Sakshi

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “సత్యభామ”. ఈ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో నటిస్తోంది. నవీన్‌ చంద్ర, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీపావళి పండుగను ముందే తీసుకువస్తూ “సత్యభామ” సినిమా టీజర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు.

“సత్యభామ” సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే.. హత్యకు గురైన ఓ యువతిని రక్షించే క్రమంలో ఆమె ప్రాణాలు కాపాడలేకపోతుంది పోలీస్ ఆఫీసర్ సత్యభామ. అప్పటి నుంచి ఆమె గిల్టీ ఫీలింగ్‌తో బాధపడుతూ ఉంటుంది. పై అధికారులు.. సత్య, ఈ కేసు నీ చేతుల్లో లేదు అని చెబితే.. కానీ ఆ ప్రాణం నా చేతుల్లోనే పోయింది సార్ అంటుంది సత్య. అమాయకురాలైన యువతిని చంపిన హంతకుల కోసం వేట మొదలుపెడుతుంది సత్యభామ.

ఈ వేటను మన ఇతిహాసాల్లో నరకాసుర వధ కోసం యుద్ధరంగంలో అడుగుపెట్టిన సత్యభామ సాహసంతో పోల్చుతూ ప్లే అయ్యే బ్యాగ్రౌండ్ సాంగ్ ఆకట్టుకుంది. ఈ కేసును క్లోజ్ చేసేది లేదన్న సత్యభామ.. ఆ హంతకులను పట్టుకుందా? వారిని చట్టం ముందు నిలబెట్టిందా? లేదా అనే అంశాలతో టీజర్ ఆసక్తికరంగా ముగిసింది. “సత్యభామ” చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు.

చదవండి: ఆదిపురుష్‌కు పని చేయడమే నేను చేసిన పెద్ద తప్పు.. దేశం వదిలి వెళ్లిపోయా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement