
‘‘సత్యభామ పాత్రలో నటించడం సవాల్‌గా అనిపించింది. ఇలాంటి పాత్ర నా కెరీర్‌లో ఇదే తొలిసారి. ఇది నా కెరీర్‌లో స్పెషల్ ్రపాజెక్ట్‌గా భావిస్తున్నాను’’ అన్నారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆమె లీడ్ రోల్‌లో నటించిన సినిమా ‘సత్యభామ’. నవీన్ చంద్ర కీలక పాత్ర చేశారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. దర్శకుడు శశికిరణ్ తిక్క ఈ మూవీకి సమర్పకులుగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్ ప్లే అందించారు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ‘సత్యభామ’ మ్యూజికల్ ఈవెనింగ్ పేరుతో నిర్వహించిన ఈవెంట్‌లో ఈ మూవీలోని ‘వెతుకు వెతుకు..’ అంటూ సాగే పాట రిలీజ్ చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పాడారు. కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘నేను ఓ బిడ్డకు జన్మ నిచ్చిన తర్వాత చేసిన సినిమా ‘సత్యభామ’. మన అమ్మాయిలు క్షేమంగా ఉండాలనే పాయింట్ ఈ కథలో నన్ను ఆకట్టుకుంది’’ అన్నారు. ఈ వేడుకలో శశికిరణ్ తిక్క, శ్రీ చరణ్ పాకాల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment