
వెతుకు... వెతుకు.. అంటూ నేరస్తులను వెతుకున్నారు పోలీసాఫీసర్ సత్యభామ. వారిని పట్టుకోవడానికి ఆమె ఎలాంటి సాహసాలు చేశారు? అనే కథతో రూపొందిన చిత్రం ‘సత్యభామ’. పోలీసాఫీసర్ సత్యభామగా కాజల్ అగర్వాల్ చేశారు. నవీన్ చంద్ర అమరేందర్ కీలక పాత్రధారి. దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరించి, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రానికి సుమన్ చిక్కాల దర్శకుడు.
బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలోని మూడో పాట ‘వెతుకు వెతుకు..’ని ఈ నెల 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, ‘‘నేరస్తులను పట్టుకోవడానికి సత్యభామ చేసే అన్వేషణే ఈ పాట నేప థ్యం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల స్వరకర్త.