![Telugu Actress Hema Revealed Why She Not Doing Movies - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/12/actress-hema.jpg.webp?itok=RNkiFn-v)
ప్రముఖ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వెండితెరపై అక్క, వదిన, భార్య వంటి పాత్రలు పోషించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఎక్కువగా కమెడియన్ల సరసన నటించిన ఆమె తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించింది. భర్తను కనుసన్నల్లో పెట్టి ఆడించే భార్యగా హేమ పరకాయ ప్రవేశం చేసి నటించేది. అలా ఇండస్ట్రీలో నటిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హేమ ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు.
చదవండి: క్యాన్సర్ బారిన ఆటో రామ్ ప్రసాద్? క్లారిటీ ఇచ్చిన నటుడు
గత మా ఎలక్షన్స్‌లో చురుగ్గా కనిపించిన ఆమె పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటోందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె తను సినిమాలు చేయకపోవడానికి కారణం వెల్లడించింది. కమెడియన్ కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ రెండవ బ్రాంచ్‌ను ఇటీవల మణికొండలో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవానికి హాజరైన హేమ ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించింది.
చదవండి: ప్రకాశ్ రాజ్ కామెంట్స్‌పై ఘాటుగా స్పందించిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్
ఈ సందర్భంగా ఈ మధ్య సినిమాల్లో కనిపించడం లేదు ఎందుకు? అనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘ఈ మధ్య కొత్త బిజినెస్ పెట్టాను. అందులో మంచి లాభాలు వస్తున్నాయి. సంపాదన ఎక్కువ అవడంతో సుఖ పడటం అలవాటు అయిపోయింది. కష్టపడటానికి ఇష్టపడటం లేదు అంతే’ అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. అయితే అది ఎలాంటి బిజినెస్ అనేది మాత్రం ఆమె చెప్పేందుకు ఆసక్తి చూపలేదు. సమయం వచ్చినప్పుడు చెప్తానంటూ మాట దాటేసింది.
Comments
Please login to add a commentAdd a comment