శివాజీనగర: ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు నటి హేమకు సీసీబీ పోలీసులు మరో నోటీసు జారీ చేశారు. సోమవారం విచారణకు రావాలని మొదటిసారి నోటీసు పంపగా, జ్వరం వచ్చినందున రాలేనని హేమ తెలిపారు. మంగళవారం రెండో నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మని చెప్పారు.
రేవ్ పార్టీ ఏర్పాటు చేసిన వాసు, అరుణ్, సిద్ధికి, నాగబాబుతో పాటుగా ఐదుగురికి మే 27న 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు ఆదేశించింది. దీంతో మంగళవారం నుంచి వారిని సీసీబీ విచారణ చేపట్టింది. రేవ్ పార్టీ, డ్రగ్స్ సరఫరా వెనక ఉన్న వారిని తెలుసుకునే లక్ష్యంగా వీరిని పోలీసులు ప్రశ్నించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment