ఈ మధ్య కాలంలో డ్రగ్స్ కేసు మరోసారి టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. నటి హేమ ఇందులో ఉండటంతో అందరూ ఈ విషయమై తెగ మాట్లాడుకున్నారు. అయితే బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణకి హాజరు కావాలని హేమకు పోలీసులు నోటీసులు పంపించారు. సోమవారమే దీనికి హాజరు కావాల్సి ఉండగా, తాను జ్వరంతో బాధపడుతున్నానని చెప్పి డుమ్మా కొట్టింది. మరోవైపు ఈమెకు సంబంధించిన లేటెస్ట్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)
వీడియోలో ఏముందంటే?
'మనమేం దేవుళ్లం కాదు. ఒకవేళ తప్పు చేసినా, పొరపాటు జరిగినా సారీ చెప్పొచ్చు. అప్పుడు మనం చాలా ఫ్రెష్‌గా ఉంటాం. అలానే అబద్దం చెబితే దాన్ని కవర్ చేయడానికి 100 అబద్దాలు ఆడాలి. అందుకని 99.9 శాతం అబద్దాలు ఆడకుండా ఉంటే బెటర్. అందుకని నేను చాలా హ్యాపీగా ఉన్నానని' హేమ చెబుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఇదంతా కూడా డ్రగ్స్ కేసు గురించేనని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
కేసు సంగతేంటి?
మే 19న బెంగళూరులోని ఓ ఫామ్ హౌసులో రేవ్ పార్టీ నిర్వహించారు. పోలీసులు రైడ్ చేసి దాదాపు 103 మంది బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. వీళ్లలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు రిపోర్ట్స్‌లో తేలింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఈ క్రమంలోనే పోలీసులు నోటీసులు జారీ చేయగా, తాను రాలేకపోతున్నానని మరికొంత సమయం కావాలని లేఖ రాసింది. కానీ దీన్ని పోలీసులు పరిగణలోకి తీసుకోకుండా మరోసారి నోటీసులు జారీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆరేళ్ల తర్వాత తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)
Comments
Please login to add a commentAdd a comment