బిగ్‌బాస్ హౌస్‌లో ఆదివారం అంతా సందడిగా గడిచింది. హౌస్‌మేట్స్ అందరి డ్రెస్సింగ్‌పై నాగ్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. అనంతరం మూడు బౌల్స్‌లో మూడు కలర్స్ స్లిప్స్‌లో ఒక్కోదాంట్లో గుడ్, యావరేజ్, బ్యాడ్ వ్యక్తుల పేర్లను రాయమని ఇంటి సభ్యులందర్ని ఆదేశించాడు. అనంతరం ఇంటి సభ్యులందరిని మూడు టీమ్‌లుగా విడగొట్టి డంబ్ షెరాడ్స్ ఆడించాడు. అనంతరం కోటి ముప్పై లక్షల ఓట్లు వచ్చాయని తెలిపాడు. ఇంట్లోని మెజార్టీ సభ్యులు హేమను బ్యాడ్ పర్సన్‌గా ఎంచుకున్నారని.. బయట ప్రజల ఓటింగ్ కూడా అలాగే ఉందని హేమ ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించారు.
ఇక ఆదివారం ఎపిసోడ్ సాగిందిలా.. ఇంటి సభ్యులందర్నీ మూడు టీమ్స్‌గా విభజించాడు. ఏ టీమ్ నుంచి రోహిణి, బీ టీమ్ నుంచి వితికా షెరు, సీ టీమ్ నుంచి శ్రీముఖి యాక్ట్ చేయడానికి వచ్చారు. అయితే ఈ ఆటలో కేవలం పాటలు మాత్రమే ఉంటాయని వాటినే నటించి చూపించాలని, అవతలి వాళ్లు కనిపెట్టాలని తెలిపాడు. దీంతో మొదటి టీమ్ లోంచి రోహిణి రాగా.. ఒక్క పాటను(వాట్ అమ్మా..) మాత్రం సరిగా నటించి చూపలేకపోయింది.
ఇక రెండో టీమ్‌లోంచి వితికా రాగ.. ఒక పాటను పెదాలతో పాడి వినిపించింది. మరొక పాట(జింగిడి.. జింగిడి) తెలీక వదిలేసింది. ఇక శ్రీముఖి అత్యుత్సహాన్ని ప్రదర్శించి లిప్ మూవ్‌మెంట్ చేస్తూ ఓ పాయింట్‌ను, పాట తెలీక ఇంకో పాయింట్‌ను కోల్పోయింది. మొత్తానికి ఈ టాస్క్‌లో ఏ టీమ్ విజేతగా నిలవడంతో వారికి చికెన్, పన్నీర్‌ను బిగ్‌బాస్ కానుకగా ఇచ్చాడు. అయితే వారికి ఇష్టమైతే మిగతా ఇంటిసభ్యులకు కూడా ఇవ్వొచ్చని తెలిపడంతో.. అందరం కలిసి పంచుకుంటామన్నారు. ఇక ఇంటి సభ్యులు అందరూ ఆనందంగా ఉన్న సమయలో రాహుల్, వితికాలు సేవ్ అయినట్లు తెలిపాడు.
జాఫర్, హేమలు మాత్రమే మిగలగా.. హేమ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. సెల్ఫీ మూవ్‌మెంట్ అనంతరం బయటకు వచ్చిన హేమ.. తన జర్నీకి సంబంధించిన ప్రోమోను చూస్తూ ఎమోషనల్ అయింది. వంటగది వల్లే గొడవలు వచ్చాయని, అది తప్ప తనపై ఎలాంటి ఫిర్యాదులు లేవని తెలిపింది. ఓ మదర్ ఫీలింగ్‌తో ఉన్నానని, అయితే ఎక్కువ పెట్టుకోవద్దు.. అది తీయొద్దు ఇది తీయొద్దు అని అనడంతో అది డామినేట్ చేయడం, కమాండింగ్‌లా అందరికీ అనిపించిందని.. అందుకే అందరూ తనను బ్యాడ్ అని అనుకున్నారని తెలిపింది. వాళ్ల కోసం చేసేది వాళ్లకే అర్థం కానప్పుడు అక్కడ ఉండటం వ్యర్థమనిపించిందని తెలిపింది. ఇంట్లోని సభ్యులందరూ మంచి వారేనని, శ్రీముఖి.. బాబా భాస్కర్ మాత్రం ఫైనల్ వరకు ఉండొచ్చని తెలిపింది.
మహేష్.. మనసుకు మంచోడని మాటలు మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండమని.. శ్రీముఖి, హిమజలకు ఆల్‌ది బెస్ట్ అని చెప్పింది. స్వీట్ హార్ట్ అషూ రెడ్డిని మాత్రం స్వార్థంగా ఉంచానని, తనకు బిగ్‌బాస్‌లో టైమ్ కావాలని.. అలీ బాగా ఆడుతున్నారని.. కొంచెం కోపం తగ్గించుకోవాలని రాహుల్‌కు.. వితికా, వరుణ్‌లు హౌస్‌లో ఉండాలని అందరూ కోరుకున్నారని అయితే మన్మథుడు చెప్పినప్పుడు అప్పుడప్పుడు కాంప్లిమెంట్స్ ఇవ్వాలని వరుణ్‌కు సూచించింది. టాస్క్‌లో టీచర్‌లా బాగా నటించిందని పునర్నవిని మెచ్చుకుంది. రవికృష్ణ మంచోడని.. అయితే మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండమని, రోహిణి అందరితో కలిసిపోతుందని.. అందర్నీ నమ్మేస్తుందని అలా ఉండకూడదని వివరించింది. ఇంటిపైన బెంగపెట్టుకోవద్దని హౌస్‌లో ఇంకా ఉండాలని ప్రజలు కోరుకున్నారని.. ఇకపై తాము జాఫర్‌ను చూడాలని అనుకుంటున్నట్లు తెలిపింది. తనకు వంటలో చిట్కాలు నేర్పిందని, ఇంటికి వెళ్లాక అవి వండి తన భార్య దగ్గర మంచి పేరు తెచ్చుకుంటానని బాబా భాస్కర్ తెలిపారు. చివరగా.. హౌస్‌మేట్స్ బాధ్యతను బాబా భాస్కర్‌కు అప్పగించి హేమ వెళ్లిపోయింది.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
అనుకున్నట్లే.. అందరూ ఊహించినట్లే హేమ ఎలిమినేట్ అయింది. వచ్చీ రాగానే అందరిని డామినేట్ చేయడంతో.. హౌస్‌మేట్స్‌తో పాటు ఆడియెన్స్‌లో కూడా హేమపై వ్యతిరేకత ఏర్పడింది. దీంతో మొదటి వారంలో హేమ ఇంటిబాటపట్టింది. అయితే హేమను రీప్లేస్ చేసేందుకు బిగ్‌బాస్.. ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీని ప్రవేశపెట్టారు. ఆదివారం ఉదయం నుంచి ప్రచారం జరిగినట్టుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment