బిగ్‌బాస్‌.. హేమ అవుట్‌! | Hema May First Contestant Eliminated From Bigg Boss 3 Telugu | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌.. హేమ అవుట్‌!

Published Sat, Jul 27 2019 11:12 PM | Last Updated on Sun, Jul 28 2019 5:21 PM

Hema May First Contestant Eliminated From Bigg Boss 3 Telugu - Sakshi

అనుకున్నట్లే శనివారం నాగ్‌ ఎంటర్‌టైన్‌ చేశాడు. ఇంట్లోని సభ్యుల్నే కాకుండా ఆడియెన్స్‌ను కూడా మెప్పించాడు. తనదైన చలాకీతనం, అనుభవంతో ఎవరినీ నొప్పించకుండా చాలా అందంగా హెచ్చరించాడు. దీంతో నాగ్‌ హోస్టింగ్‌ స్టైలే వేరని మరోసారి రుజువైంది. అయితే ఈ వారం హైలెట్‌గా నిలిచిన వరుణ్‌ సందేశ్‌-మహేష్‌ ఉదంతాన్ని మాత్రం టచ్‌ చేయలేదు. మిగతావారి అందరి లెక్కలను సెట్‌ చేశాడు నాగ్‌. రవికృష్ణ బాగా డిసప్పాయింట్‌ చేశాడని, హేమ డామినేషన్‌ చేసిందని, పునర్నవి చాలా మెచ్యుర్డ్‌గా ఆలోచిస్తుందని, శ్రీముఖి అందరితో బాగా కలిసిపోతుందని, వరుణ్‌-వితిక రోమాన్స్‌, బాబా భాస్కర్‌-జాఫర్‌ బ్రొమాన్స్‌ అంటూ నాగ్‌ అందర్నీ టచ్‌ చేశాడు. ఇక నాగ్‌ కోరిక మేరకు.. ఇంటిసభ్యులపై రాహుల్‌ చేసిన ‘ఇల్లాకత్తా మఫిలియా’ పాట ఆకట్టుకుంది.

కన్నీళ్లు పెట్టించిన శివజ్యోతి (సావిత్రి)
నాగ్‌ ఎంట్రీ ఇచ్చాక.. ఆ రోజు హౌస్‌లో ఏం జరిగిందో చూపించాడు. తన ప్రేమ కథను చెప్పి హౌస్‌మేట్స్‌తో పాటు, ఆడియెన్స్‌ను కంటనీరు పెట్టించింది సావిత్రి. పందొమ్మిదేళ్లకే ఇంట్లోంచి బయటకు వచ్చేయడం.. ప్రేమ వ్యవహారం గొడవలు.. భర్త కష్టపడి పోషించడం.. కుటుంబ పరిస్థితులు గురించి చెబుతూ కన్నీరు పెట్టించింది. చివరకు తాను ఉద్యోగం చేసుకుంటూ తన భర్తను చదివించానని తెలిపింది. తన తండ్రి చిన్నప్పటి నుంచి కుటుంబాన్ని పట్టించుకోలేదని.. అయితే చివరి రోజుల్లో తన వద్దే ఉన్నాడని చెప్పుకొచ్చింది. ఇలా తన గతం చెప్పుకుంటూ ఉంటే అషూ కన్నీరు కారుస్తూ ఉంది. తన సతీమణి గుర్తుకొస్తుందని ఏడ్చిన జాఫర్‌ను శ్రీముఖి, వితికా షెరు, వరుణ్‌ సందేశ్‌లు ఓదార్చారు. అనంతరం బాబా భాస్కర్‌తో కలిసి జాఫర్‌ వేసిన మూన్‌ వాక్‌ స్టెప్పులను వీక్షిస్తూ నాగ్‌ సైతం ఎంజాయ్‌ చేశాడు. ఇక వరుణ్‌ సందేశ్‌-వితికల మాటలు వింటూ.. భార్యభర్తలిద్దరూ బాత్‌టబ్బులో కూర్చుని రొమాన్స్‌ చేసుకుంటూ చక్కగా ఉన్నారని కితాబిచ్చాడు.

జాఫర్‌-బాబా భాస్కర్‌ల బ్రొమాన్స్‌
వారం రోజుల తర్వాత ఇంటిసభ్యులకు నాగ్‌ దర్శనమిచ్చాడు. నాగ్‌ కనపడేసరికి ఇంటి సభ్యులందరూ సంతోషంగా పలకరించారు. ఇక ఒక్కొక్క సభ్యుడితో ముచ్చటించేందుకు పిల్లో గేమ్‌ను మొదలుపెట్టారు. మ్యూజిక్‌ ఆగిపోయాక పిల్లో ఎవరి దగ్గర ఆగుతుందో అతని దగ్గరి నుంచి మొదలుపెడతానని తెలిపాడు. అయితే మొదటగా జాఫర్‌ వంతు వచ్చింది. హోమ్‌ సిక్‌ వల్ల  జాఫర్‌  కంటతడి పెట్టిన విషయాన్నిగుర్తుచేశారు నాగ్‌. ఇంటరాగేషన్‌ చేసే తనలాంటి వ్యక్తికి  ఫ్యామిలీ అనేది బలమైన ఎమోషన్‌ అని నాగ్‌ అన్నారు. మూన్‌ వాక్‌ స్టెప్పుల గురించి నాగ్‌ ఆరా తీశారు. ఈ విషయంలో బాబా భాస్కర్‌ను నాగ్‌ అభినందించారు. తనను ఎమోషనల్‌ మూడ్‌ నుంచి బయటకు తీసుకురావడానికి బాబా భాస్కర్‌ చేసిన ప్రయత్నం బాగుందని మెచ్చుకున్నారు. ఇక బాబా భాస్కర్‌, జాఫర్‌లు కలిసి పాడిన పాటను మళ్లీ పాడించారు. దీంతో హౌస్‌లో నవ్వులు పూశాయి. 

రవికృష్ణ-మహేష్‌ల హగ్‌
వెరీ యాంగ్రీ విత్‌ యూ అంటూ రవికృష్ణను ఉద్దేశించి నాగ్‌ అన్నాడు. మహేష్‌ విషయంలో రవికృష్ణ అన్న మాటలు కరెక్ట్‌ కాదని, బిగ్‌బాస్‌ హౌస్‌లో జాతి, రంగు,కులం, మతం, ప్రాంతం అంటూ ఉండవని, ఇక్కడే కాదు ఎక్కడా ఉండకూడదని తెలిపాడు. వెంటనే మహేష్‌కు సారీ చెప్పానని రవికృష్ణ వివరించాడు. రవికృష్ణకు నల్లరంగు పూసే.. అవకాశం ఇచ్చినా మహేష్‌ మాత్రమ వద్దన్నాడు. రవికృష​, మహేష్‌ హగ్‌ చేసుకోవాలని, కలిసుండాలని నాగ్‌ ఆదేశించాడు. వెంటనే ఇద్దరు హత్తుకోవడమే కాకుండా ముద్దులు కూడా పెట్టుకుని మనస్పర్దలను తొలగించుకున్నారు.

పునర్నవికి చపాతిని అందించిన నాగ్‌
అందరికీ హెల్ప్ చేస్తున్నావని‌, చిన్న పిల్లల టాస్క్‌లో మహేష్‌కు సర్దిచెప్పడం, టాస్క్‌లో పార్టిసిపెట్‌ చేసేలా ఒప్పించడం గురించి మాట్లాడుతూ.. పునర్నవిని మెచ్చుకున్నాడు. ఇంత చిన్న వయసులో అంత మెచ్యురిటీ ఎలా వచ్చిందని పొగిడాడు. ఇక ట్విటర్‌లో ట్రెండింగ్‌ అయిన చపాతి ఇష్యూను గుర్తు చేశాడు. అసలు ఆ చపాతి గొడవేంటని ఇంటిసభ్యులను అడిగాడు. బాబా భాస్కర్‌ తన చపాతిని తీసుకున్నాడని తెలిసినా కూల్‌గా రియాక్ట్‌ అయ్యావని పునర్నవి గురించి చెప్పాడు. చివరకు ఓ చపాతిని బిగ్‌బాస్‌ పంపించగా.. బాబా భాస్కర్‌ చేతుల మీదుగా పునర్నవికి ఇప్పించాడు.

వరుణ్‌ సందేశ్‌-వితిక రొమాన్స్‌
వరుణ్‌ సందేశ్‌ను తన సతీమణి వితికా షెరు గురించి అడిగాడు. ఆమె నామినేషన్‌లో ఉందని ఏమైనా బాధపడుతున్నావా అని అడగ్గానే.. వితికా తన భర్తపై ఫిర్యాదు చేయడం మొదలుపెట్టింది. తాను నామినేషన్‌లో ఉన్నానని, ఎలాగో వెళ్లిపోతున్నావని తన బ్రెడ్‌, ఎగ్స్‌ తింటున్నాడని నాగ్‌కు వివరించింది. దీనిపై వరుణ్‌ను ప్రశ్నించగా.. తనకు బాగా ఆకలివేసిందని అయితే పాటపాడితే బ్రెడ్‌ ఇస్తానన్నందుకు ఓ పాట పాడానని, అన్నమాట ప్రకారం తనకు ఓ బ్రెడ్‌ ముక్కను ఇచ్చిందని వివరించాడు. అక్కడ పాడిన పాటను మళ్లీ పాడమని నాగ్‌ కోరగా.. కొత్త బంగారు లోకం సినిమాలో నీ ప్రశ్నలు అనే పాటను పాడి వినిపించాడు. వితికా వెళ్లాలని సింబాలిక్‌గా ఈ పాట పాడావా? అంటూ చమత్కరించాడు. అలా ఏం లేదని తను ఒకవేళ ఎలిమినేట్‌ అయితే తనను బాగా మిస్‌ అవుతానని తెలిపాడు. తనను హౌస్‌లో ఎత్తుకోవడం లేదని, మీరు చేసే రొమాన్స్‌ను చూసి.. జాఫర్‌కు తన ఇళ్లు గుర్తొచ్చి బాధపడుతున్నారంటూ నవ్వులు పూయించాడు. 

కన్నీళ్లు పెట్టిన మొట్ట మొదటి కంటెస్టెంట్‌.. హిమజ
హౌస్‌లో కన్నీళ్లు పెట్టిన మొట్ట మొదటి కంటెస్టెంట్‌ అని, ఎందుకు కన్నీళ్లు పెట్టావంటూ హిమజను ప్రశ్నించాడు. తాను మొదట్నుంచీ సెన్సిటివ్‌ అని, తన మూలానా మహేష్‌కు గాయమైందనే బాధలో ఉండగా.. హేమ ఏదో అనడంతో బాగా ఏడుపు వచ్చిందని తెలిపింది. తాను రెడ్‌ మార్క్‌ను తొలగించుకునేందుకు మాత్రమే ఉదయాన్నే బాత్రూమ్‌ను క్లీన్‌ చేయలేదని, అంతకుముందు కూడా చేశానని తెలిపింది. 

శివ జ్యోతి కథ వింటూ కన్నీరు పెట్టిన అషూరెడ్డి
హౌస్‌లోకి ఎంటర్‌ అయ్యేటప్పుడు గలగలా మాట్లాడవని, కానీ బిగ్‌బాస్‌ హౌస్‌లో మాత్రం సైలెంట్‌గా ఉన్నావెందుకు అని అడిగాడు. శివజ్యోతి తన కథంతా చెబుతూ ఉంటే అషూ రెడ్డి కన్నీరు పెట్టుకోవడం గురించి నాగ్‌ ప్రస్తావించాడు. అయితే శివజ్యోతి కథ విని అలా ఏడుపు వచ్చిందా లేకుంటే.. తన గతం గుర్తుకువచ్చిందా? అని ప్రశ్నించాడు. తన గతాన్ని మర్చిపోయాయని ప్రస్తుతం బాగానే ఉన్నానని తెలిపింది. శివజ్యోతి గురించి ప్రస్థావిస్తూ.. తన భర్తతో కలిసి భర్తలు ఎలా ఉండాలనే ట్రైనింగ్‌ సెంటర్‌ పెట్టాలని సూచించాడు. వెంటనే శివజ్యోతి సమాధానమిస్తూ.. ఫ్రీగా కోచింగ్‌ ఇస్తామని, ఇంట్లోనే ఉంచుకుని తిండి కూడా పెడతామని తెలిపింది. 

డామినేషన్ చేశావు‌.. నామినేషన్‌లో పెట్టేశారు
ఇంట్లోకి వచ్చిన వెంటనే అందరి మీద డామినేషన్ చేశావు‌.. అందరూ కలిసి నామినేషన్‌లో పెట్టేశారు అంటూ హేమపై పంచ్‌ వేశాడు. డైనింగ్‌ టేబుల్‌ వద్ద ఆ రోజు ఏం జరిగిందంటూ ప్రశ్నించాడు. అలీ రెజా ఆరోజు ఏం జరిగిందో వివరించాడు. తాను వంటచేసి పెడతాను గొడవ ఎందుకు అనే ఉద్దేశ్యంలోనే అలా అన్నానని హేమ వివరణ ఇచ్చింది.

శ్రీముఖి.. అలకనంద
ఇంట్లో అందరితో బాగా కలిసిపోతోందని శ్రీముఖిని నాగ్‌ మెచ్చుకున్నాడు. శ్రీముఖికి అలకనంద అనే పేరును నాగ్‌ సూచించాడు. అయితే అక్కడిదిక్కడ.. ఇక్కడిదక్కడ చెప్పకుండా, జాగ్రత్తగా ఉండమని తెలిపాడు. ఇద్దరి మధ్య వచ్చిన గొడవలను పరిష్కరించడానికే అలా చేస్తున్నానని, కానీ తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తెలిపింది. తాను అక్కడిదిక్కడ ఇక్కడిదక్కడ చెప్పడం లేదని ఇకపై జాగ్రత్తగా ఉంటానని వివరించింది.

ఇక సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్నట్లుగా మొదటివారం ఇంట్లోంచి హేమ బయటకు వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. నామినేషన్‌లో ఉన్న ఆరుగురులోంచి హిమజ, పునర్నవిలు సేఫ్‌ అయినట్లుగా నాగ్‌ ప్రకటించాడు. బయట ట్రెండ్‌ అవుతున్న దాన్ని బట్టి చూస్తే.. మిగిలిన వారందరిలోకెల్లా  హేమకు మాత్రం కాస్త ఎక్కువ వ్యతిరేకత ఏర్పడింది. మరి ఇదే నిజమై హేమ బయటకు వస్తుందా అన్నది తెలియాలంటే ఆదివారం షో ప్రసారం అయ్యే వరకు ఆగాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement