
Actress Hema: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అధ్యక్ష రేసులో ఇప్పటికే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ ఉండగా, తాజాగా ఈ ఎన్నికలలో నేనూ బరిలోకి దిగుతున్నానని ప్రకటించారు సీనియర్ నటి హేమ. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో తనను సపోర్ట్ చేసిన వారందరి కోరిక మేరకే ఈ సారి అధ్యక్ష పదవి కోసం పోటీకి దిగుతున్నానని హేమ పేర్కొంది. ఈ ఎలక్షన్స్ లో తొలుత ట్రెజరర్ పదవికి పోటీ చేయాలని అనుకున్న హేమ.. తనవారి కోసం అధ్యక్ష పదవి రేస్‌లోకి దిగబోతున్నట్లు స్పష్టం చేశారు.
కాగా, మా ఎన్నికల కోసం ఇప్పటికే టాలీవుడ్ మూడు వర్గాలుగా చీలిపోయింది. మహేశ్, ఎన్టీఆర్ ఎవరికి మద్దతిస్తారనేదానిపై టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.. ప్రకాశ్‌రాజ్ చిరంజీవి మద్దతుతోనే బరిలోఉన్నారని తెలుస్తోంది. మంచు విష్ణు తన తండ్రి మోహన్‌బాబు ఆశీస్సులతో పోటీలో నిలిచారు. జీవిత రాజశేఖర్‌కు నందమూరి బాలకృష్ణ మద్దతు ఉన్నట్లు టాలీవుడ్‌వర్గాల్లో చర్చనడుస్తోంది. ఇక ఈ ముగ్గురే కాకుండా మరో సీనియర్ సహాయనటి హేమ కూడా ‘మా’ అధ్యక్ష పదవి రేస్‌లోకి రావడంతో ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి.
చదవండి:
మా' ఎన్నికలు: చిరు, బాలయ్య సపోర్ట్ ఎవరికి?
Comments
Please login to add a commentAdd a comment