
భర్తకు తలకొరివి పెడుతున్న భార్య హేమ
విశాఖపట్నం, అక్కిరెడ్డిపాలెం: కన్నవాళ్లు, బంధువులు ఉన్నా అక్కరకురాలేదు. భర్త చనిపోతే కనీసం తలకొరివి పెట్టడానికి ఎవ్వరూ ముందుకురాని దుస్థితి. కనీసం ఖర్మకాండలు చేపట్టడానికి కూడా బంధువులు కనికరం చూపకపోవడంతో భర్తకు భార్యే తలకొరివి పెట్టింది. జీవీఎంసీ 59వ వార్డు నాతయ్యపాలెంలో ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. శ్రీకాకుళం నుంచి బతుకు తెరువుకోసం యర్రా మోహన్ (40), భార్య హేమ, కుమార్తె గౌతమి (5)తో వలస వచ్చి 59వ వార్డు నాతయ్యపాలెంలో నివాసం ఉంటున్నారు.
ఈ క్రమంలో కొద్దికాలంగా మోహన్ అనారోగ్యానికి గురయ్యాడు. ఐదు రోజుల క్రితం గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందాడు. అయితే గ్రామంలో కొందరు బంధువులు ఉన్నా వీరిని పట్టించుకోలేదు. కనీసం ఖర్మకాండలకు సహకరించలేదు. దీంతో స్థానికులు కొంత సహాయం చేయడంతో మృతుని భార్య హేమ భర్త పార్థివదేహానికి నాతయ్యపాలెం శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment