మెగాస్టార్ చిరంజీవి.. రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా హీరోనే. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌లను ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నాడు. అలాగే కోవిడ్ సమయంలో ఆక్సిజన్ లేక చాలా మంది ప్రాణాలు కోల్పోవడం చూసి చలించిపోయిన చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో ఓ ఆక్సిజన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఇలా పెద్ద ఎత్తున సేవా కార్యాక్రమాలు చేపడుతున్న ఈ రియల్ హీరో.. ఏనాడు కూడా తను చేసిన సహాయం గురించి బయట చెప్పుకోడు. కానీ ఆయన ద్వారా లబ్ది పొందిన వారు మాత్రం చిరు సాయాన్ని చెప్పుకొని మురిసిపోతుంటారు. తాజాగా నటుడు రాజా రవీంద్ర హేమకు చిరంజీవి చేసిన ఓ గొప్ప సహాయం గురించి చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి చేసే సహాయా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రోజంతా మాట్లాడినా సరిపోదు. కరోనా సమయంలోనూ ఒక్క క్షణం ఖాళీ లేకుండా ఉన్నారు. అందరికీ వ్యాక్సినేషన్ చేయించారు.. బ్లడ్ బ్యాంక్ వ్యవహారాలు చూసుకున్నారు.. ఆక్సిజన్ బ్యాంక్‌ను ప్రారంభించారు.. సీసీసీ పెట్టి అందరికీ నిత్యావసర సరుకులు అందించారు. కరోనా సమయంలో రక్తం ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ సమయంలోనూ అన్నయ్యే దగ్గరుండి అన్నింటిని చూసుకున్నారు. బ్లడ్ బ్యాంకే కదా అని మనం ఈజీగా తీసుకుంటాం. కానీ దాని వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నాడు అన్నయ్య.
నటి హేమ డెలివరీ సమయంలో రక్తం కావాల్సి వచ్చింది. ఆమెది ఓ నెగెటివ్ బ్లడ్. అది చాలా రేర్‌గా దొరుకుతుంది. ఆ సమయంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వల్లే ఆమె బతికింది. లేకపోతే చనిపోయేది. అలా రక్తం విలువ అవసరంలో ఉన్న వారికే తెలుస్తుంది. బ్లడ్ బ్యాంక్ నడపడం అంత సులేవీమీ కాదు. దానికి నెలకు కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది’అని రాజా రవీంద్ర చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని గతంలో హేమ కూడా చెప్పారు. తాను ప్రాణ ప్రాయ స్థితిలో ఉన్న సమయంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆదుకుందని హేమ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment