బిగ్‌బాస్‌: ‘శ్రీముఖి వల్ల అందరూ బలవుతున్నారు’ | Bigg Boss 3 Telugu: Hema Sensational Comments On Srimukhi | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ : ‘నిర్వాహకులు చెడు మాత్రమే చూపిస్తారు’

Oct 27 2019 3:52 PM | Updated on Oct 28 2019 4:54 PM

Bigg Boss 3 Telugu: Hema Sensational Comments On Srimukhi - Sakshi

బిగ్‌బాస్‌ షోపై, కంటెస్టెంట్‌ శ్రీముఖిపై సీనియర్‌ నటి హేమ సంచలన ఆరోపణలు చేశారు.

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన సీనియర్‌ నటి హేమ వారం తిరక్కుండానే బయటికి వచ్చేశారు. అయితే, బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటికి వచ్చిన తర్వాత మిగతా కంటెస్టెంట్లపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరోమారు బిగ్‌బాస్ నిర్వాహకులపై విమర్శలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మట్లాడుతూ.. అటు బిగ్‌బాస్‌ గురించి, ఇటు శ్రీముఖి గురించి సంచలన విషయాలు వెల్లడించారు. బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ సమయంలో తన గురించి పూర్తి ఏవీ (ఆడియో విజువల్‌) వేయలేదని, తన ఎంట్రీని దరిద్రంగా మార్చిన డైరెక్టర్‌కు గట్టిగానే ఇచ్చానని తెలిపారు.. బిగ్‌బాస్‌ నిర్వాహకులు చెడు మాత్రమే చూపిస్తారని విమర్శించారు. షో ఎడిటరే అక్కడ బిగ్‌బాస్‌ అని వ్యాఖ్యానించారు. తనకు ఫైనల్‌కు రావాలని పిలుపు వచ్చినప్పటికీ మళ్లీ అవమానపడటం తన వల్ల కాదని తిరస్కరించినట్టుగా పేర్కొన్నారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ శ్రీముఖిపై సంచలన ఆరోపణలు చేశారు.

శ్రీముఖి బయట ఒకలా, లోపల మరొకలా మాట్లాడుతుందని హేమ విమర్శించారు. హిమజ వచ్చేశాక బిగ్‌బాస్‌ చూడటమే మానేశానని అన్నారు.. ఎందుకంటే అందులో ఉన్నవాళ్లంతా ఒకే గ్రూపు అని చెప్పుకొచ్చారు. శ్రీముఖి బర్త్‌డే నాడు అందరూ కలిసి పార్టీ చేసుకున్నారని.. అప్పుడే తనను బయటకు పంపించేయాలని డిసైడ్‌ అయ్యారని హేమ ఆరోపించారు. ‘ఇంటి సభ్యులందరూ నన్ను పంపించేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. లేకపోతే తాను స్ట్రాంగ్‌గా మారుతానని వారు భావించారు. అందుకోసమే నాతో కావాలని గొడవ పెట్టుకునేవారు. ఈ విషయం నాకు తర్వాత అర్థమైంది’అని హేమ చెప్పుకొచ్చారు. రాహుల్‌తో సహా అందరూ శ్రీముఖి బర్త్‌డేకు వెళ్లారని.. ఎవరు ఏ వారంలో ఎలిమినేట్‌ కావాలనే విషయాన్ని అప్పుడే ప్లాన్‌ చేసుకున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీముఖి గేమ్‌లో అందరూ బలవుతున్నారని హేమ అభిప్రాయపడ్డారు. ఇక మరోవారంలో బిగ్‌బాస్‌ షోకు ఎండ్‌కార్డ్‌ పడనుందనగా ఈ వ్యాఖ్యలు ప్రేక్షుకులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement