
నటి హేమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అక్కగా, వదినగా, భార్యగా ఎన్నో క్యారెక్టర్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన హేమ నటి సురేఖ వాణి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. సురేఖ వాణి తన బెస్ట్‌ఫ్రెండ్ అని, తమలాగే తన కూతురు ఈషా, సురేఖ కూతురు సుప్రీత మంచి ఫ్రెండ్స్ అని తెలిపింది.
అయితే వారిద్దరి స్నేహాన్ని చూసి ఓర్వలేక వారిద్దరిని విడగొట్టడానికి సురేఖవాణి ప్రయత్నించినట్లు హేమ పేర్కొంది. అందుకోసం తన కూతురిని స్కూల్ మార్పించిందని అయినా కూడా సుప్రియ కూతురు మళ్ళీ తన కూతురు చదివే స్కూల్‌కే వచ్చిందని, దానికి గల కారణం సుప్రీత బోల్డ్ గా ఉండటమే అంటూ తనదైన రీతిలో సమాధానం చెప్పింది.
అంతేకాకుండా తను షూటింగ్‌లో ఉన్న సమయంలో తన గురించి సురేఖవాణి వేరే వాళ్లతో తప్పుగా మాట్లాడేదని, అందుకే ఆమెకు దూరంగా ఉన్నానంటూ ఆరోపణలు చేసింది. ప్రస్తుతం హేమ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment