![Actress Hema Inquiry In Drugs Case](/styles/webp/s3/article_images/2024/06/6/hema_0.jpg.webp?itok=lHMRWCna)
బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమను విచారించేందుకు బెంగళూరు నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) పోలీసులకు అనుమతి లభించింది. బెంగళూరు నగర శివార్లలో ఇటీవల జరిగిన రేవ్‌పార్టీలో హేమ మాదక ద్రవ్యాలను తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఆమె రక్తనమూనాలను సేకరించి వైద్య పరీక్షకు పంపించగా మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు రిపోర్ట్ వచ్చింది.
సీసీబీ పోలీసులు పలుమార్లు నోటీసులు పంపగా ఎట్టకేలకు హేమ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆనేకల్ న్యాయస్థానం ముందు ఆమెను పోలీసులు హాజరుపరిచారు. హేమను విచారించేందుకు మూడురోజుల కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోర్టును కోరారు. అయితే, న్యాయస్థానం మాత్రం 24 గంటల పాటు ఆమెను విచారిస్తే చాలని తెలిపింది. ఆపై గురువారం సాయంత్రం ఐదుగంటలకు మళ్లీ కోర్టులో హాజరు పరచాలని పోలీసులకు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment