బెంగళూరు శివార్లలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో ఈ నెల 19న జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు నటి హేమ పేరు బయటకు రావడంతో టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. తాజాగా రేవ్ పార్టీలో పాల్గొన్నవారి రక్త నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా 86 మంది డ్రగ్స్ సేవించినట్లు తేలింది. ఈ క్రమంలో హేమ బ్లడ్ షాంపిల్స్‌లో కూడా డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో హేమ మే 27న విచారణకు వెళ్లనున్నట్లు సమాచారం.
బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై మా అధ్యక్షుడు మంచు విష్ణు తన ఎక్స్ పేజీలో ఒక ట్వీట్ చేశారు. నటి హేమపై కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న అసత్య ప్రచారాలు ఆపాలని ఆయన కోరారు. ఆమెపై ఇంకా నేరం రుజువు కాలేదని ఆయన గుర్తుచేశారు. ఎవరికి వారే హేమ తప్పుచేసినట్లు నిర్ధారిస్తే ఎలా అని ప్రశ్నించారు. శ్రీమతి హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే భావించబడాలి. ఆమె కూడా ఒక తల్లి, భార్య అని గుర్తించాలి. ఇలాంటి పుకార్ల ఆధారంగా చేసుకుని ఆమెను దూషించడం అన్యాయం.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను తప్పకుండా ఖండిస్తుంది. ఒకవేళ హేమ మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించిన సరైన ఆధారాలను పోలీసులు ఇస్తే ఆమెపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అప్పటి వరకు, దయచేసి నిరాధారమైన వార్తలను వ్యాప్తి చేయకుండా ఉండాలి.' అని మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు.
Regarding the recent drug-related case at a rave party, few media outlets and individuals are making baseless allegations about actress Ms.Hema.
I urge everyone to refrain from jumping to conclusions and spreading unverified information. Ms.Hema deserves to be presumed innocent…— Vishnu Manchu (@iVishnuManchu) May 25, 2024
Comments
Please login to add a commentAdd a comment