
హిమాయత్‌నగర్: ప్రస్తుతం.. ‘నేను నా భర్తతోనే ఉంటున్నాను, వేరే ఎవర్నీ పెళ్లి చేసుకోలేదు’. అసలు యూట్యూబ్ ఛానల్స్ వాళ్లు నాపై పడి ఏడవాల్సిన అవసరం ఏముందని సినీనటి హేమ కొల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితం మా వివాహ వార్షికోత్సవ వీడియోలను తాజాగా నేను రెండో పెళ్లి చేసుకున్నానంటూ అసత్య ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టనంటూ హెచ్చరించారు.
ఈమేరకు కొన్ని యూట్యూబ్ చానల్స్‌పై హేమ మంగళవారం సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. పలు కీలకమైన విషయాలను ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఆమె తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. డబ్బు సంపాదించేందుకు కొందరు మూర్ఖులు కాపురాల్లో చిచ్చుపెడుతున్నారన్నారు. కోట శ్రీనివాసరావు చచ్చిపోయినట్లుగా, కొణిదల నిహారిక విడిపోయినట్లుగా, నాగచైతన్య నాగార్జునకు మధ్య గొడ వలు ఉన్నట్లుగా, నాకు వేరే వాళ్లతో సంబంధాలు ఉన్నట్లు తంబ్‌నెయిల్స్ పెడుతున్నారన్నారు. న్యాయపరమైన పోరాటం చేస్తానని, ఎవరినీ ఊపేక్షించనంటూ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment