Viral: Actress Hema Shocking Comments On Relationship With Puri Jagannadh - Sakshi
Sakshi News home page

'పూరి చాలా మంచోడు.. ఆయనకు ఎప్పటికీ ఒకరే భార్య'

Published Thu, May 13 2021 11:30 AM | Last Updated on Thu, May 13 2021 1:11 PM

Actress Hema Shares Relation With Director Puri Jagannadh - Sakshi

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో వదిన, భార్య, అక్క పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు గుర్తిండిపోయిన నటి హేమ. ఈ మధ్య సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హేమ..డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. పూరి  ప్రేమించిన అమ్మాయితో తామే దగ్గరుండి పెళ్లి చేశామని, కాళ్లు కడిగి కన్యాదానం కూడా చేశామని పేర్కొంది. అంతేకాకుండా ఎప్పుడైనా డబ్బు అవసరం అయితే ఇచ్చేదాన్ని అని..ఇప్పటికీ మంచి రిలేషన్‌ ఉందని చెప్పింది.

'నేను క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఉన్న సమయంలోనే పూరి జగన్నాథ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేసేవాడు. ఆ సమయంలో సింగిల్‌ ఎపిసోడ్స్‌కు డైరెక‌్షన్‌ చేసేవారు. అప్పుడే ఆయనతో పరిచయం ఏర్పడింది. ఇక అప్పట్నుంచి బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌లా ఉండేవాళ్లం. మా ఫ్యామిలీకి పూరీ ఎంత క్లోజ్‌ అంటే..అతను ఉంటేనే నన్ను షూటింగ్స్‌కు పంపేవారు. ఒంటరిగా వెళ్లనిచ్చేవారు కాదు. ఇక ఎప్పుడైనా డబ్బు అవసరం అయితే నన్నే అడిగివాడు. ఆ టైంలో మా ఆయన ఒక్కరే వర్క్‌ చేసేవాడు. దీంతో ఉన్నదాంట్లోనే  మా ఆయనకు తెలియకుండా పూరికి డబ్బులిచ్చేదాన్ని.

ఐదందలు, వెయ్యి ఇలా పోపు డబ్బాల్లో దాచుకొని ఇచ్చేదాన్ని. మళ్లీ నాకు తిరిగి ఇచ్చేవాడు. అలా ఎప్పుడు అవసరం ఉన్నా అడిగివాడు. ఏం ఉన్నా అందరం కలిసి ఉండేవాళ్లం. ఓ షూటింగ్‌లో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని పరిచయం చేశాడు.. ఆ అమ్మాయి లావణ్య(పూరి జగన్నాథ్‌ భార్య)గారేనా అని ఇంటర్వ్యూయర్‌ అడగ్గా..పూరి జగన్నాథ్‌ ఒకే అమ్మాయినే ప్రేమించాడు.. ఒక్కతే భార్య ఉంటుంది ఎప్పటికీ అని హేమ వివరణ ఇచ్చింది. ఇక పెద్దవాళ్లు ఎవరూ లేకపోతే తన భర్తతో కలిసి దగ్గరుంచి కాళ్లు కడిగి కన్యాదానం చేశానని, అలా పూరి జగన్నాథ్‌కి తాను అక్కతో పాటు అత్తనవుతాను' అని తెలిపింది. 

చదవండి : పిచ్చిదానిలా ఉన్నా..నీకు హాట్‌గా కనిపించానా : నటి హేమ
రజనీతో సెల్ఫీ షేర్‌ చేసిన మంచు లక్ష్మి.. ఫోటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement