విచారణకు రాలేనంటూ లేఖ రాసిన హేమ | Actress Hema Did Not Attend To Enquiry In Bengaluru Rave Party Case, More Details Inside | Sakshi
Sakshi News home page

Bengaluru Rave Party Case: విచారణకు రాలేనంటూ లేఖ రాసిన హేమ

Published Mon, May 27 2024 12:26 PM | Last Updated on Mon, May 27 2024 1:34 PM

Actress Hema Did Not Attend Enquiry

బెంగళూరు శివార్లలోని జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో ఈ నెల 19న జరిగిన రేవ్‌ పార్టీలో పాల్గొన్నట్లు నటి హేమ పేరు బయటకు రావడంతో టాలీవుడ్‌లో సంచలనంగా మారింది.  రేవ్‌ పార్టీలో పాల్గొన్నవారి రక్త నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా 86 మంది డ్రగ్స్‌ సేవించినట్లు తేలింది. ఈ క్రమంలో హేమ బ్లడ్‌ షాంపిల్స్‌లో కూడా డ్రగ్స్‌ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో హేమ  నేడు మే 27న విచారణకు వెళ్లాల్సి ఉంది. అయితే, ఆమె విచారణకు హాజరుకాలేనని లేఖ ద్వారా తెలిపింది.

వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు  లేఖ ద్వారా పోలీసులకు హేమ తెలిపింది. అయితే ఆ లేఖను సీసీబీ పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, విచారణకు మరికొంత సమయం ఇవ్వాలని హేమ కోరింది. అయితే, నేడు సాయంత్రం హేమకు మరో నోటీసు జారీ చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement