బెంగళూరు నగర శివారులోని ఓ ఫాంహౌస్‌లో జరిగిన రేవ్‌పార్టీ వివాదంలో చిక్కుకున్న టాలీవుడ్ నటి హేమకు చిక్కులు తప్పడం లేదు. ఈ రేవు పార్టీపై విచారణ చేపట్టిన బెంగళూరు పోలీసులు తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అందులో 88 మందిని నిందితులుగా వారు పేర్కొన్నారు. అయితే నటి హేమ డ్రగ్స్ సేవించినట్లు ఛార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 1086 పేజీలతో వారు ఛార్జ్‌షీట్ రెడీ చేశారు.
ఇదీ చదవండి: ధనుష్‌పై రెడ్‌కార్డ్ ఎత్తివేత.. కొత్త ప్రాజెక్ట్‌లకు లైన్ క్లియర్
బెంగళూరు రేవ్ పార్టీలో హేమ ఎండీఎంఏ డ్రగ్స్ సేవించినట్లు ఆధారాలు లభ్యమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్‌ను కూడా ఛార్జ్‌షీట్‌తో వారు పొందుపరిచారు. హేమతో పాటు 79 మందిని నిందితులుగా చేర్చారు. పార్టీ నిర్వహించిన మరో 9మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. NDPS సెక్షన్- 27 కింద హేమను నిందితురాలిగా ఛార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. అయితే, హేమతో పాటు రేవ్ పార్టీకి హాజరైన మరో నటుడికి డ్రగ్స్ తీసుకోలేదని రిపోర్ట్ వచ్చింది. బెంగళూరు పోలీసులు తాజాగా అందించిన ఛార్జ్‌షీట్‌తో నటి హేమకు చిక్కులు తప్పవని తెలుస్తోంది.
హేమకు షాకిచ్చిన పోలీసులు
బెంగళూరు రేవు పార్టీలో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని పలు మీడియా సంస్ధల ఇంటర్వ్యూలలో నటి హేమ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, బెంగళూరు పోలీసులు మాత్రం ఆమె డ్రగ్స్ తీసుకున్నారంటూ తాజాగా ఛార్జ్‌షీట్‌లో తన పేరు చేర్చి షాకిచ్చారు. దీంతో ఆమెకు చిక్కులు తప్పవని తెలుస్తోంది. ఈ వివాదం నుంచి ఆమె ఎలా బయటపడుతారంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.
సినీ నటి హేమపై 'మా' నిర్ణయం ఎటు..?
'హేమ' చెబుతున్న మాటల వల్ల కొద్దిరోజుల క్రితం ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) కూడా ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేసింది. తనకు నిర్వహించిన రక్త పరీక్షలలో డ్రగ్స్ నెగటివ్ వచ్చిందని అందుకు సంబంధించిన రిపోర్టులను కూడా ఆమె సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఆపై వాటిని 'మా'కు కూడా ఒక కాపీ పంపింది. తాను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే కోర్టు కూడా బెయిల్ మంజూరు చేసిందని కూడా తెలిపింది. దీంతో ఆమెపై విధించిన సస్పెన్షన్‌ను మా ఎత్తివేసింది. ఇప్పుడు ఆమె పేరు ఛార్జ్‌షీట్‌లో ఉండటంతో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment