‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ | Actor Hema Respond On Bigg Boss 3 Controversy | Sakshi
Sakshi News home page

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ

Published Thu, Jul 18 2019 3:16 PM | Last Updated on Fri, Jul 26 2019 7:23 PM

Actor Hema Respond On Bigg Boss 3 Controversy - Sakshi

నన్ను ఎవరైనా ఏమైనా అంటే  ఆ రోజే స్పందిస్తా. ఆ రోజే మీడియా ముందుకు వస్తా

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగులో రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని మూడో సీజన్లోకి అడుగిడుతున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’ ని వివాదాలు చుట్టుముట్టాయి. షో ప్రసారం కాకముందే ప్రముఖుల ఆరోపణలు, కేసులతో వార్తల్లో నిలిచింది. ‘బిగ్ బాస్-3’పై ఇప్పటికే జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి, నటి గాయిత్రి గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ షో ప్రాసారాన్ని నిలిపి వేయాలని కోరుతూ తెలంగాణ హై కోర్టులో ఇప్పటికే పిల్‌ దాఖలైంది. బిగ్ బాస్ షో ప్రదర్శన వ‌ల్ల యువ‌త చెడిపోతుందంటూ  సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తెలంగాణ హై కోర్టును ఆశ్ర‌యించిన సంగతి తెలిసిందే. ఇలా ‘బిగ్‌బాస్’  చుట్టూ అల్లుకుంటున్న వివాదాలు.. షో నిర్వాహకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

(చదవండి : బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ: కన్ఫర్మ్‌ చేసిన యాంకర్‌)

తాజాగా ఈ రియాల్టీ షోపై నటి హేమ స్పందించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బిగ్‌బాస్‌-3ని ఆపలేవంటూ.. ఈ షోకి తన మద్దతు తెలిపారు. క్యాస్టింగ్‌ కౌచ్‌ లాంటివి ఈ షోలో ఉంటే నాగార్జున లాంటి పెద్ద హీరో హోస్ట్‌గా చేయడానికి ఎందుకు ఒప్పకుంటారని ప్రశ్నించారు. ఇక షోపై కేసు వేసిన వారి గురించి ప్రస్తావిస్తూ.. ‘ ఎవరితోనైనా నిర్వాహకులు తప్పుగా మాట్లాడితే అప్పుడే స్పందించాలి. నెల రోజుల ముందే జరిగితే ఇప్పుడు బయటకి వచ్చి చెబితే ఎలా? సెలెక్ట్‌ చేయలేదు అన్న తర్వాత ఇలా మాట్లాడడం ఎంతవరకు న్యాయం? నన్ను ఎవరైనా ఏమైనా అంటే  ఆ రోజే స్పందిస్తా. ఆ రోజే మీడియా ముందుకు వస్తా. లేదంటే వారి కాలర్‌ పట్టుకొని నిలదీస్తా’ అని హేమ అన్నారు. బిగ్‌బాస్‌-3లో తనకు అవకాశం వస్తే తప్పకుండా పాల్గొంటానని తన మనసులోని మాటను చెప్పారు. రాజకీయాల్లోకి వస్తున్న తనను ప్రజలకు ఏ విధంగా ఆదరిస్తారని ఈ షో ద్వారా తెలుసుకోవచ్చునన్నారు. ఒక వేళ తనకు ఈ షోలో అవకాశం వచ్చి పాల్గొంటే.. అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement