సీటీఆర్‌ఐ శాస్త్రవేత్త హేమకు బంగారు పతకం
Published Thu, Feb 9 2017 11:31 PM | Last Updated on Thu, Jul 25 2019 5:25 PM
గొల్లప్రోలు :
రాజమండ్రి సీటీఆర్‌ఐలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న బలివాడ హేమ జాతీయస్థాయి గోల్డ్‌మెడల్‌ను పొందారు. న్యూఢిల్లీలోని ఇండియ¯ŒS అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో పీహెచ్‌డీ చేసిన ఆమె కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహ¯ŒSసింగ్ చేతుల మీదుగా గురువారం గోల్డ్‌మెడల్‌ను, బెస్ట్ అవుట్‌స్టాండింగ్ స్టూడెంట్ అవార్డును అందుకున్నారు. ఆమె గతంలో కోయంబత్తూరు వ్యవసాయ విశ్వ విద్యాలయంలో ఎమ్మెస్సీ విద్యార్థిగా అప్పటి తమిళనాడు గవర్నర్ రోశయ్య చేతుల మీదుగా గోల్డ్‌మెడల్‌ను పొందడంతో పాటు పలు అవార్డులను కైవసం చేసుకున్నారు. ఆమె భర్త, మండలంలోని దుర్గాడ పశువైద్యశాల వైద్యుడు డాక్టర్ అయిరెడ్డి వీరప్రసన్నకుమార్ ఈ వివరాలను తెలిపారు.
Advertisement
Advertisement